ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు సిజేరియన్ నిర్వహించిన వైద్యులు గర్భంలో టవల్ పెట్టి అలాగే కుట్లు వేసిన ఘటన యూపీలోని అమ్రోహాలో జరిగింది.
కరోనా నుంచి తప్పించుకోవడానికి ముక్కూ, మూతి కవర్ చేసేలా మాస్కులను వాడటం సాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరు వీటిని విధిగా ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలా ఎంత మంది ఆచరిస్తున్నారో లేదో కానీ, ఓ వ్యక్తి మాత్రం తన బైక్ నంబర్ ప్లేటుకు కూడా మాస్క్ తగిలించాడు.
రోడ్లపై గుంతలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది కిందపడి లేదా ఇతర వాహనాలను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మంగళవారం చెన్నైలో 22 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ యువతి రోడ్డుపై గుంతను తప్పించుకునే క్రమంలో ట్రక్కును ఢీకొట్టింది.
తడాది నవంబర్‌లో ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి మూత్రం పోశాడు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 26న చోటుచేసుకుంది.
దాయాది దేశమైన పాకిస్థాన్ ప్రజల జీవితంపై ఆర్థిక సంక్షోభం అధికంగా ప్రభావం చూపుతోంది. సంక్షోక్షం తలెత్తడంతో ఆ దేశ సర్కారు నిత్యావసర వస్తువులపై కోత పెడుతోంది. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన పాక్... తన ఖర్చులను తగ్గించుకునే పనిలో నిమగ్నమైంది.
హర్యానా క్రీడల మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన మహిళా కోచ్, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మంగళవారం పేర్కొన్నారు.
న్యూ ఇయర్ వేళ ఉక్రెయిన్ జరిపిన దాడిలో తమ సైనికులు 89 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతీయ రాజధాని డొనెట్స్క్‌లోని జంట నగరమైన మాకివికాలోని వృత్తి విద్యా కళాశాలలో నాలుగు ఉక్రేనియన్ క్షిపణులు తాత్కాలిక రష్యన్ బ్యారక్‌లను తాకినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంటికి పొరుగున ఉండే 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసి ఆపై విషం పెట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.