Kerala Minister: ఆదిశంకరాచార్యులు క్రూరమైన కుల వ్యవస్థను సమర్థించారు.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Minister: ఆదిశంకరాచార్యపై కేరళ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హిందూ వైదిక తత్వవేత్త ఆదిశంకరాచార్య క్రూరమైన కుల వ్యవస్థకు చెందిన న్యాయవాది, ప్రతినిధి అంటూ కేరళ మంత్రి, కమ్యూనిస్ట్ నాయకుడు ఎంబీ రాజేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శంకరాచార్య, నారాయణ గురుదేవుల మధ్య సమాంతరాన్ని మంత్రి వివరించారు. నారాయణ గురుదేవులు శంకరాచార్యను విమర్శించారని.. నారాయణ గురుదేవులే కేరళలో ‘ఆచార్య’ అని అన్నారు.
వర్కాల శివగిరి మఠంలో జరిగిన కార్యక్రమంలో రాజేష్ మాట్లాడుతూ.. కేరళకు ఆచార్యులుంటే అది శ్రీనారాయణ గురువే తప్ప ఆదిశంకరాచార్యులు కాదని, శంకరాచార్యులు మనుస్మృతిపై ఆధారపడిన క్రూరమైన కులవ్యవస్థను సమర్థించారన్నారు. శ్రీనారాయణ గురువే మనుస్మృతిని పారద్రోలేందుకు కృషి చేశారని అన్నారు. శంకరాచార్య కుల వ్యవస్థను సమర్ధించడమే కాకుండా దానికి ప్రతినిధిగా కూడా ఉన్నారని ఆయన అన్నారు. కుల వ్యవస్థను సమర్ధించిన శంకరాచార్యపై శ్రీనారాయణ గురు విమర్శలు చేశారని రాజేష్ అన్నారు. సమాజంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుపోవడానికి శంకరాచార్యులే కారణమని మంత్రి అన్నారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Bharat Jodo Yatra: 3వేల కిలోమీటర్లు పూర్తి.. నేడు యూపీలో పునఃప్రారంభం
“శంకరాచార్యుల తర్వాత శ్రీనారాయణ గురువే అని ఇప్పుడు కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. కాదు, శంకరాచార్యను విమర్శించిన వ్యక్తి గురువే. కుల వ్యవస్థ ప్రజలను కబళించిందని, దానికి శంకరాచార్యులు కూడా కారణమని శ్రీనారాయణ గురువే చెప్పారు” అని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, ఆదిశంకరాచార్య, శ్రీ నారాయణ గురుదేవులు ఒకే భారతీయ వంశానికి చెందిన వారని, ఒకే దృష్టిని ముందుకు తెచ్చారని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీ రాజేష్ హిందూమతంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని మురళీధరన్ అన్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!