ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో అనుమతించబడిన రాజకీయ ప్రకటనల రకాలను విస్తరింపజేస్తామని ట్విట్టర్ మంగళవారం తెలిపింది.
త్రిపురలోని గోమతి జిల్లాలోని ఉదయపూర్‌లో మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ పూర్వీకుల ఇంటి వెలుపల మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పూజారులపై దాడి చేశారు.
దిల్లీలో యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాద సమయంలో యువతి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై మరో యువతి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే తాజాగా యువతి మృతదేహం శవపరీక్ష పూర్తి అయింది
చైనాతో పాటు పలుదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. దీంతో భారత్‌లోనూ నాలుగో వేవ్ భయం నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
జాతీయ రహదారిపై ఉన్న గుంతల్ని తప్పించబోయి.. క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం చెప్పిన సంగతి తెలిసిందే. పంత్‌ను కలిసిన తర్వాత ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదంపై సీఎం చేసిన వ్యాఖ్యలకు జాతీయ రహదారుల శాఖ కౌంటర్ ఇచ్చింది.
ప్రజా ప్రతినిధుల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పరిమితులు విధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించాలని.. ప్రజా ప్రతినిధులు చేసే విద్వేష వ్యాఖ్యల వల్ల సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషన్ దాఖలైంది.
ఒడిశాలో మంగళవారం మరో రష్యన్ శవమై కనిపించాడని, పక్షం రోజుల్లో ఇది మూడోదని పోలీసులు తెలిపారు. జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్ ఓడరేవులో లంగరు వేసిన ఓడలో మిల్యకోవ్ సెర్గీ అనే రష్యన్ వ్యక్తి శవమై కనిపించాడు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేయనున్నారు.