భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించింది. ఒకప్పటి డబుల్స్ నెంబర్ వన్ ప్లేయర్ సానియా మీర్జా ఈ ఏడాది ఫిబ్రవరి 19న దుబాయ్‌లో ప్రారంభమయ్యే (డబ్లూటీఏ1000) దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్ తర్వాత తన ఫ్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లుగా వెల్లడించారు సానియా మీర్జా.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం జోషిమఠ్ పట్టణంలో భారీ పగుళ్లు ఏర్పడి ప్రమాదంలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న దాదాపు 600 కుటుంబాలను వెంటనే ఖాళీ చేయవలసిందిగా ఆదేశించారు.
కొత్త సంవత్సరం వేళ ఢిల్లీలో ఓ యువతిని కారుతో దాదాపు 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే మరో భయంకరమైన ఘటన హర్యానాలో జరిగింది. తన ద్విచక్రవాహనం ఎక్కడానికి నిరాకరించినందుకు ఓ వ్యక్తి ఓ మహిళను హెల్మెట్‌తో దారుణంగా చితకబాదాడు.
తన కష్టాలు తీరడం లేదని ఓ వ్యక్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఆ దేవుడిపైనే ఆగ్రహం పెంచుకున్నాడు. ఆ కోపంతో ఆస్తికుడు కాస్త నాస్తికుడై ఆలయాలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు.
అయోధ్యలో తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న రామాలయం గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నామని, దాని కోసం అత్యుత్తమ శిల్పులను నిమగ్నం చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు శుక్రవారం తెలిపారు.
భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో నేడు నిర్ణయాత్మక పోరు జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు అయ్యేసరికి రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ టీ-20 సిరీస్‌లో ఆఖరిపోరుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి.
ఓ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడికి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆ విమానంలో ఉన్న భారత సంతతికి చెందిన వైద్యుడు ఆ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు.
భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సత్య నాదెళ్లతో ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఢిల్లీ మేయర్ పీఠం కోసం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో భారీ గందరగోళం చెలరేగింది. ఈరోజు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో రెండు వర్గాల మధ్య రసాభాస జరిగింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది.
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న కోల్డ్‌వేవ్ పరిస్థితులు శుక్రవారం తీవ్రమయ్యాయి, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉదయం నైరుతి ఢిల్లీలోని ప్రాంతాలలో ఒకటైన ఆయా నగర్‌లో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. సఫ్దర్‌జంగ్‌లో ఉష్ణోగ్రత 4.0 డిగ్రీలుగా ఉంది.