Delhi Mayor Polls: మేయర్ పీఠం కోసం కొట్లాట.. తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Mayor Polls: ఢిల్లీ మేయర్ పీఠం కోసం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో భారీ గందరగోళం చెలరేగింది. ఈరోజు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో రెండు వర్గాల మధ్య రసాభాస జరిగింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఎంసీడీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటమిపాలైనప్పటికీ మేయర్ పదవికి బీజేపీ పోటీ పడుతోంది. మేయర్ తామే దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆప్ తరపున షెల్లీ ఒబెరాయ్ పోటీపడుతుండగా, బీజేపీ నుంచి రేఖా గుప్తా బరిలో నిలిచారు. బ్యాకప్ అభ్యర్థిగా అషు థాకూర్‌ను ఆప్ నిలబెట్టనుంది. డిప్యూటీ మేయర్ పోస్ట్ కోసం ఆప్ నుంచి ఆలె ముహమ్మద్ ఇక్బాల్, జలాజ్ కుమార్‌లు, బీజేపీ నుంచి కమల్ బార్గీలు పోటీలో ఉన్నారు. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. 250 స్థానాలు ఉన్న ఎంసీడీలో.. 134 ఆప్, బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస్ 9 స్థానాలు గెలుపొందింది. తొలుత ఓటమి కారణంతో మేయర్ పదవికి పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. కొన్ని పరిణామాలతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పోటీలోకి బీజేపీ దిగింది.
సివిక్ సెంటర్ మధ్యలో ఆప్, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. విజువల్స్‌లో, సభ్యులు ఒకరినొకరు నెట్టడం, కొందరు నేలమీద పడటం కనిపించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన తాత్కాలిక స్పీకర్ సత్య శర్మ నామినేటెడ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం ప్రారంభించినప్పుడు నిరసనలు చెలరేగాయి. ఎన్నికైన కౌన్సిలర్లు నామినేటెడ్ సభ్యుల కంటే ముందే ప్రమాణం చేసి ఉండాలని ఆప్ సభ్యులు తెలిపారు. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే లెఫ్టినెంట్ గవర్నర్ అనేక అపాయింట్‌మెంట్లు చేశారని, మేయర్ ఎన్నికలను బీజేపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా బీజేపీతో పొత్తుపెట్టుకున్న 10 మంది నామినేటెడ్ సభ్యులను ఎంపిక చేశారని ఆరోపించారు.
Also Read
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
Cold Wave: గజగజ వణికిస్తున్న చలి.. ఢిల్లీలో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
నామినేటెడ్ సభ్యుల పేర్లను పేర్కొన్న తర్వాత, సక్సేనా మేయర్ ఎన్నికకు అధ్యక్షత వహించడానికి తాత్కాలిక స్పీకర్‌గా బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మను కూడా నియమించారు. సీనియర్ మోస్ట్ కౌన్సిలర్ అయిన ముఖేష్ గోయల్‌ను ఆ పదవికి ఆప్ సిఫార్సు చేసింది. మూడు పర్యాయాలు అధికారం చేపట్టిన తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ మేయర్ పదవిని తామే కైవసం చేసుకుంటామని ప్రకటించింది. “సభలో అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నామినేట్ చేయడం సంప్రదాయం. కానీ బీజేపీ అన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాలు, సంస్థలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది” అని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ మేయర్ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు.
#WATCH | Delhi: BJP and AAP councillors clash with each other and raise slogans against each other ahead of Delhi Mayor polls at Civic Centre. pic.twitter.com/ETtvXq1vwM
— ANI (@ANI) January 6, 2023
- Tags
- AAP Protests
- bjp
- clash
- Delhi
- delhi mayor
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!