వివాహేతర సంబంధాల మోజులో పడి జనాలు తమ సంసారాల్ని కూల్చుకుంటున్నారు. భాగస్వామ్యుల్ని చంపుకుంటున్నారు. ఆ తర్వాత జరిగే పర్యావసానాలు, కుటుంబ విలువల్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. అడ్డుగా ఉన్నారని.. ప్లాన్స్ వేసి మరీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటి వాటిని మనం సాధారణ ఇన్ఫెక్షన్లుగా భావిస్తాం కదా. ఇప్పుడు వీటి సరసన కరోనాను కూడా చేరుస్తూ చైనా క్వారంటైన్‌ను ఎత్తివేసింది. ఆదివారం నుంచి కరోనా కూడా సాధారణ వ్యాధే.
విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు ఉపాధ్యాయులు రకరకాలు ప్రయత్నించడం సాధారణమే. పాఠశాలకు వచ్చిన అనంతరంబాగా చదివితే పెన్, నోట్స్ ఏదో ఒకటి బహుమతిగా ఇస్తామని చెబుతారు. మంచి మార్కులు తెచ్చుకున్న వారిని క్లాస్ రూమ్‌లో ప్రశంసించడంతోపాటు.. ప్రోత్సాహకంగా ఏదో గిఫ్ట్ ఇస్తారు. కానీ ఓ స్కూల్ ప్రిన్సిపాల్ మాత్రం విద్యార్థులకు ఏకంగా ఫ్లైట్, ట్రైన్, బస్ ప్రయాణాలు ఉచితంగా కల్పిస్తానని ఆఫర్ ఇచ్చారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌తో సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
దేశ రాజధానిలో 20 ఏళ్ల మహిళను కారు ఢీకొట్టి 13 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన జరిగిన వారం తర్వాత ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1న జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది.
పొగమంచు కారణంగా తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఆదివారం తెల్లవారుజామున 1 గంటలకు ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టడంతో 17 మంది మృతి చెందగా, 22 మంది గాయపడినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. శనివారం అర్థరాత్రి జిల్లాలోని బాలాకోట్ సెక్టార్‌లో ఉగ్రవాదులు హతమైనట్లు వారు తెలిపారు.
జమ్మూలోని రౌజౌరీలో హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటం, ఇళ్లలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు పేగు తెంచుకుని పుట్టిన పిల్లల విషయంలో వ్యవహరిస్తున్న తీరు తల్లి ప్రేమకు మచ్చ తెచ్చే విధంగా ఉంది. తాజాగా ఇలాంటి తరహా ఘటన మహారాష్ట్రలో జరిగింది.