Viral Video: బైక్ ఎక్కలేదని మహిళను హెల్మెట్‌తో చితకబాదాడు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Hits Woman For Refusing To Ride With Him On His Bike : కొత్త సంవత్సరం వేళ ఢిల్లీలో ఓ యువతిని కారుతో దాదాపు 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే మరో భయంకరమైన ఘటన హర్యానాలో జరిగింది. తన ద్విచక్రవాహనం ఎక్కడానికి నిరాకరించినందుకు ఓ వ్యక్తి ఓ మహిళను హెల్మెట్‌తో దారుణంగా చితకబాదాడు. వారిద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హర్యానాలో ఓ వ్యక్తి తన బైక్‌పై వెళ్లేందుకు నిరాకరించిన మహిళను హెల్మెట్‌తో కొట్టడం సీసీటీవీ రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
తన బైక్‌పై ప్రయాణించడానికి నిరాకరించినందుకు కమల్ అనే వ్యక్తి తన పొరుగింట్లో నివసించే ఓ మహిళను హెల్మెట్‌తో కొట్టినట్లు గురుగ్రామ్ ఏసీపీ మనోజ్ వెల్లడించారు. సీసీటీవీ వీడియో ప్రకారం.. ఆటో వచ్చి గురుగ్రామ్‌లోని ఓ ప్రాంతంలో ఆగగా.. అందులో నుంచి ఓ మహిళ దిగింది. అదే సమయంలో ఓ బైక్ అటు నుంచి వచ్చింది. ఆ మహిళ, కమల్ కొంత సేపు మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ ఆ బైక్ ను కొంత ముందుకు తీసుకెళ్లి పక్కన ఆపేసి హెల్మెట్ తీస్తూ మహిళ దగ్గరకు వచ్చాడు. క్షణాల్లోనే వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం మొదలు కాగా.. ఆగ్రహంతో కమల్ తన హెల్మెట్ తీసి దారుణంగా మహిళపై దాడికి పాల్పడ్డాడు. కోపంతో చితకబాదాడు. దీంతో చుట్టుపక్కల వారు, ఆటోడ్రైవర్ కలగజేసుకుని అతికష్టం మీద అతడిని అదుపు చేశారు.
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
Man Vandalises Temples: మొక్కినా కోరిక నెరవేరలేదని..! దేవుడినే టార్గెట్ చేశాడుగా..
ఈ వీడియోను బట్టి వారిద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ వారి గొడవకు కారణం ఏంటన్నది తెలియరాలేదు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ మనోజ్ తెలిపారు. హర్యానాలోని యమునానగర్‌లో ఇటీవల ఓ మహిళ కిడ్నాప్ ప్రయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ ఘటన కూడా సమీపంలోని సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది. మహిళ కేకలు వేసి పోరాడడంతో నలుగురు వ్యక్తులు తమ కిడ్నాప్ ప్రయత్నాన్ని విరమించుకుని పారిపోయారు.
#WATCH | Haryana: CCTV footage of a man named Kamal hitting a woman with his helmet after she refused to ride on his bike. pic.twitter.com/Az3MWRKKWo
— ANI (@ANI) January 6, 2023
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!