Man Vandalises Temples: ఎవరైనా కష్టాలు వస్తే ఏం చేస్తారు. దేవుడా నన్ను కష్టాల నుంచి గట్టెక్కించు దేవుడా అని వేడుకుంటారు. ఓ వ్యక్తి కూడా అలాగే దేవుడిని ప్రార్థించాడు. చిన్నప్పటి నుంచి ప్రార్థనలు చేస్తున్నాడు. దేవుడిని ఎంత ప్రార్థించినా కరుణించడం లేదని, తన కష్టాలు తీరడం లేదని ఓ వ్యక్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఆ దేవుడిపైనే ఆగ్రహం పెంచుకున్నాడు. ఆ కోపంతో ఆస్తికుడు కాస్త నాస్తికుడై ఆలయాలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో రెండు దేవాలయాలను ధ్వంసం చేసినందుకు 24 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు.
Ayodya Temple: అయోధ్య ఆలయంలో రాముడి నూతన విగ్రహం
చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో తన కన్ను పాడైందని, కోలుకోవాలని చేసిన ప్రార్థనలు నెరవేరకపోవడంతో ఇటీవల తాను ఈ చర్యలను చేశానని ఆ వ్యక్తి చెప్పినట్లు అధికారి తెలిపారు. చందన్ నగర్, ఛత్రిపురలోని రెండు దేవాలయాలు ఇటీవల ధ్వంసం చేయబడ్డాయని, ఒక విగ్రహాన్ని అపవిత్రం చేశాడని అదనపు డీసీపీ పోలీస్ కమిషనర్ ప్రశాంత్ చౌబే చెప్పారు. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని వెల్లడించారు. అతని తండ్రి చిన్న హార్డ్‌వేర్ స్టోర్ నడుపుతున్నాడని.. సమస్య చాలా సున్నితమైందని.. లోతుగా విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. అతనిపై ఐపీసీ 295ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయబడిందని అన్నారు.