మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈరోజు న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు వచ్చారు. సుకేష్ చంద్రశేఖర్, ఇతరులకు సంబంధించిన 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు.
విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానితుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ఉన్నారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేవా జిల్లాలో శిక్షణ విమానం కూలిపోవడంతో పైలట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో విమానంలో ఉన్న ట్రైనీ పైలట్ గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు.
కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలోనే విస్తరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలకు నెలరోజుల ముందే ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం విస్తరణ గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు తెలిపాయి.
టెర్రర్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్న సిరియాలోని ప్రాంతాల్లోకి ప్రవేశించి, అక్కడే ఉన్నారనే ఆరోపణలపై అరెస్టయిన మహిళకు ఆస్ట్రేలియా కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 31 ఏళ్ల మరియం రాడ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషీమఠ్ నగరంలో భూమి కుంగిపోవడం కలకలం రేపుతోంది. భూమి కుంగడం వల్ల దాదాపు 600 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. భయాందోళనకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకొచ్చి ఎముకలు కొరికే చలిలో ఆరుబయటే కాలం వెళ్లదీస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత ‘ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా.. ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ముంబైకి చెందిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి ఫొటోను షేర్ చేసింది.
అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉటా రాష్ట్రంలోని ఎనోచ్ సిటీలో తుపాకీ గాయాలతో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. అందులో 5 పిల్లలు ఉన్నట్లు చెప్పారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొనడం ఖాయమనిపిస్తోంది.