Heart Attack to Passenger in Flight: ఓ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడికి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆ విమానంలో ఉన్న భారత సంతతికి చెందిన వైద్యుడు ఆ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. బర్మింగ్‌హామ్ నుంచి 10 గంటల ప్రయాణంలో దాదాపు రెండుసార్లు గుండెపోటు వచ్చిన ఓ ప్రయాణికుడిని డాక్టర్ విశ్వరాజ్ వేమల అద్భుతంగా రక్షించారు. బర్మింగ్‌హామ్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రిలో కాలేయ డాక్టర్‌గా ఉన్న విశ్వరాజ్ వేమల ఆయన తల్లితో కలిసి లండన్ నుంచి బెంగళూరుకు వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానంలోని వైద్య సామగ్రి, ప్రయాణికులు అందించిన వస్తువులతో 43 ఏళ్ల రోగిని రెండుసార్లు కాపాడారు.
43 ఏళ్ల వ్యక్తి విమానం 40 వేల అడుగుల ఎత్తులో ఉండగా గుండెపోటు వచ్చి స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఊపిరి పీల్చుకోని స్థితిలో ఉన్న ప్రయాణికుడిని బతికించేందుకు డాక్టర్ విశ్వరాజ్ వేమల శాయశక్తులా కృషి చేశారు. డాక్టర్ వేమల అతన్ని బతికించడానికి దాదాపు గంటపాటు చికిత్స చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో మందులు ఉన్నాయా అని ఆన్‌బోర్డ్ క్యాబిన్ సిబ్బందిని ప్రశ్నించారు. అదృష్టవశాత్తూ, లైఫ్ సపోర్ట్‌ని ఎనేబుల్ చేయడానికి సీపీఆర్ మందులతో కూడిన ఎమర్జెన్సీ బ్యాగ్‌ని కలిగి ఉన్నారు. ఆ అనుభవాన్ని జీవతాంతం గుర్తుంచుకుంటానని డాక్టర్ వెల్లడించారు. ఈఘటన గతేడాది నవంబర్‌లో జరిగింది. లండన్ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో పల్స్ పడిపోయింది. అదృష్టవశాత్తూ వారి దగ్గర అత్యవసర కిట్ ఉంది అని డాక్టర్ విశ్వరాజ్ తెలిపారు.
Blood Donation: రక్తదానం చేస్తే.. సౌందర్యం పెరుగుతుందా?
అతని పరిస్థితిని గమనించడానికి ఆటోమేటిక్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్, ఆక్సిజన్‌తో పాటు ఇతర పరికరాలు ఏవీ బోర్డులో లేవు. డాక్టర్ వేమల కూడా విమానంలోని ఇతర ప్రయాణీకులను అడిగిన తర్వాత రోగి సంకేతాలను పర్యవేక్షించడానికి హృదయ స్పందన మానిటర్, రక్తపోటు యంత్రం, పల్స్ ఆక్సిమీటర్, గ్లూకోజ్ మీటర్‌ను కూడా పొందగలిగారు. తాను ట్రీట్మెంట్ చేస్తుండగా తన తల్లి గమనించడం భావోద్వేగానికి గురి చేసిందని డాక్టర్ అన్నారు.