ఆన్‌లైన్ పోస్టులు రెండు గ్రూపుల మధ్య చిచ్చుపెట్టాయి. ఢిల్లీలో రెండు గ్రూపుల మధ్య ఆన్‌లైన్ పోస్ట్‌ల విషయంలో జరిగిన గొడవలో ముగ్గురు అబ్బాయిలు కత్తిపోట్లకు గురయ్యారు.
శ్రీలంకతో జరిగిన తొలివన్డేలో టీమిండియా యువ పేసర్, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో.. బౌలింగ్‌లో ఉమ్రానా మాలిక్ విరుచుకుపడటంతో భారత్ శ్రీలంకను ఓటమిలోకి నెట్టేయగలిగింది.
ధిక్కార కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన పార్టీకి చెందిన ఇతర అగ్రనేతలకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన ఘటనలతో విమర్శలను ఎదుర్కొంటోన్న ఎయిరిండియా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఎయిరిండియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణించిన ఓ మహిళ చేసిన భోజనంలో రాయి వచ్చింది.
ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్‌సంజానీ కుమార్తెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఆమె న్యాయవాది మంగళవారం తెలిపారు. మాజీ అధ్యక్షుడి కుమార్తె ఫేజ్ హషేమీపై వచ్చిన ఆరోపణల వివరాలను న్యాయవాది వెల్లడించలేదు.