Crime News: ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన పాశవిక ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. జైపూర్‌లో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఆరోపణలపై 24 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. బాధిత చిన్నారి సోమవారం తన ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. హరీష్ కుమావత్ అనే నిందితుడు బాలికకు మిఠాయి ఇస్తానని మోసగించి తన ఇంటికి తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు.
Anti-Govt Protests: పోలీసుల కాల్పుల్లో 17 మంది పౌరులు దుర్మరణం
నిందితుడు గత మూడు, నాలుగేళ్లుగా ఆ కాలనీలో అద్దెకు నివసిస్తున్న హరీష్ కుమావత్ అని జవహర్‌నగర్ ఎస్‌హెచ్‌వో పన్నా లాల్ మీనా వెల్లడించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేసి పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిత చిన్నారి కేకలు వేయడం ప్రారంభించినప్పుడు నిందితుడు ఆమెను విడిచిపెట్టారని మీనా తెలిపారు. బాలిక తన తల్లితో తన బాధను పంచుకోగా.. ఆ తర్వాత ఫిర్యాదు నమోదైంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.