విపరీతమైన చలి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కొనసాగుతున్న చలి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్ కేసులు పెరుగుతున్నాయని, చలికాలంలో అధిక రక్తపోటు సాధారణమని సర్ గంగా రామ్ ఆసుపత్రి సీనియర్ న్యూరాలజిస్ట్ చెప్పారు.
బుధవారం అర్థరాత్రి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని ఓ గ్రామంలో భూ వివాదంపై జరిగిన ఘర్షణలో రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకితా భండారీ హత్య కేసులో ప్రధాన నిందితుడు, బహిష్కరణకు గురైన బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్యకు నిర్వహించిన నార్కో, పాలీగ్రాఫ్ పరీక్షలకు ఉత్తరాఖండ్‌లోని కోటద్వార్ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఆమోదం తెలిపింది.
పార వీసాల జారీని వేగవంతం చేయాలని భారతదేశం అమెరికాను అభ్యర్థించిందని, తద్వారా ప్రజలు తమ వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలను కొనసాగించేందుకు ప్రయాణాలను చేపట్టవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం తెలిపారు.
పాశ్చాత్య శక్తులు ఆయుధాల సరఫరాను, ముఖ్యంగా సుదూర క్షిపణి వ్యవస్థలను పెంచినట్లయితే ఉక్రెయిన్ ఈ సంవత్సరం యుద్ధంలో విజయం సాధించగలదని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ బుధవారం వెల్లడించారు.
తొలి వన్డేలో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుని జోరుమీదున్న టీమిండియా నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో వన్డేలో శ్రీలంకతో తలపడనుంది. గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి.
నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను ఉజ్బెకిస్థాన్‌లోని పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసింది.
డిజిటల్ ఇండియా కలను సాకారం చేసేందుకు కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెచ్చిన డిజిటల్ చెల్లింపుల పర్యావరణాన్ని మరింత ప్రోత్సహించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది.
2023లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ పాస్‌పోర్టుతో వీసా లేకుండానే 193 ప్రపంచ దేశాల్లో ప్రయాణించవచ్చు. తాజా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. జపాన్ దేశం వరుసగా ఐదో సంవత్సరం అగ్రస్థానంలో ఉంది.
ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ దశలో బెయిల్‌పై విడుదల చేయడం సరికాదని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్ గార్గ్ మిశ్రా బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చారు.