కెట్ మైదానంలో విరాట్ కోహ్లీని ఫుల్ ఫాంలో చూడటం కంటే మెరుగైన దృశ్యం ఏదైనా ఉందా? గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వద్ద ఉన్న అభిమానులు భారత మాజీ కెప్టెన్‌ను కింగ్ అంటూ అరుపులతో తమ అభిమానాన్ని చాటారు.
దక్షిణ పెరూలో పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 17మంది పౌరులు చనిపోయారు. ముందస్తు ఎన్నికలు, జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటివరకు జరిగిన నిరసనల్లో 17 మంది మృతి చెందారని ఆ దేశ మానవ హక్కుల కార్యాలయం సోమవారం వెల్లడించింది.
కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అధికారంలోని బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకుని బస్సు యాత్రను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనుంది. రేపు బెలగావిలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
జనవరి 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వత అధిరోహణ చేయనున్న సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను గిరిజన విద్యార్థిని బానోత్ వెన్నెల మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జనవరి 16న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జోషిమఠ్‌లో భూమి క్షీణించడం వల్ల పెను సవాలు ఎదురవుతోంది.
ఎన్నికలు ప్రజల హక్కు అని... జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కశ్మీరీలు కేంద్రం ముందు అడుక్కోరని.. వారు బిచ్చగాళ్లు కాదని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా అన్నారు.
వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో శుక్రవారం వరకు బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ కార్లను నిషేధించారు. సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
50మందికి పైగా ప్రయాణికులను వదిలేసి ‘గో ఫస్ట్’ విమానం సరిగ్గా చెక్ చేసుకోకుండానే గాల్లోకి ఎరిగిపోయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు.