Air India: మరో వివాదంలో ఎయిరిండియా.. భోజనంలో రాయి.. ఫోటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన ఘటనలతో విమర్శలను ఎదుర్కొంటోన్న ఎయిరిండియా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఎయిరిండియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణించిన ఓ మహిళ చేసిన భోజనంలో రాయి వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె నెట్టింట షేర్ చేసింది. ఆ ఫొటోలను షేర్ చేస్తూ ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 8న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిరిండియా విమానంలో తనకు ఈ చేదు అనుభవం ఎదురైనట్లు శార్వప్రియ సంగ్వాన్ అనే మహిళ ట్వీట్ చేసింది. “విమానంలో రాళ్లు లేని భోజనాన్ని కూడా ప్రయాణికులకు అందించలేరా? ఇంత నిర్లక్ష్యమేంటి? ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లా” అని శార్వప్రియ సంగ్వాన్ ట్వీట్ చేశారు.
China Warns: జాగ్రత్తగా ఉండండి.. జపాన్‌తో స్నేహంపై ఆస్ట్రేలియాకు చైనా వార్నింగ్
Also Read
ఈ ట్వీట్ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఎయిరిండియాపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఎయిరిండియాను తప్పుపడుతూ నెటిజన్లు రెచ్చిపోయారు. ఒకప్పుడు ప్రమాణాలకు మారుపేరు అయిన టాటా సంస్థ.. మళ్లీ ఈ పరిశ్రమలోకి వచ్చి ప్రమాణాల విషయంలో ఈ స్థాయికి పడిపోయింది. ప్రయాణికులకు సరైన సేవలు అందించలేరా? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీంతో తాజా ఘటనపై ఎయిరిండియా స్పందించింది. ‘‘ఇది ఆందోళనకర విషయమే. దీని గురించి కేటరింగ్ టీంతో మాట్లాడుతున్నాం. మీ సమస్యను పరిష్కరించేందుకు కొంత సమయం ఇవ్వండి. దీన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు’’ అని ఎయిరిండియా ఆమె ట్వీట్‌కు బదులిచ్చింది.
You don’t need resources and money to ensure stone-free food Air India (@airindiain). This is what I received in my food served in the flight AI 215 today. Crew member Ms. Jadon was informed.
This kind of negligence is unacceptable. #airIndia pic.twitter.com/L3lGxgrVbz— Sarvapriya Sangwan (@DrSarvapriya) January 8, 2023
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!