తమిళనాడు గవర్నర్, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ముదిరింది. అసెంబ్లీ నుంచి గవర్నర్ రవి వాకౌట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ జోడించిన లేదా దాటవేయబడిన భాగాలను తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఈరోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఓ ఆర్మీ అధికారి తన భార్యను హత్య చేసి ఆదివారం రాత్రి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు ముందు కల్నల్ ఓ సూసైడ్ నోట్ కూడా రాశారు.
కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఉక్రెయిన్‌కు పలు దేశాలు ఆయుధాలు సరఫరాతో పాటు ఆర్థికంగా సహాయం అందిస్తున్నాయి.
మత మార్పిడి అనేది తీవ్రమైన సమస్య అని.. అది రాజకీయ రంగు పులుముకోకూడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్‌పై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సహాయాన్ని సోమవారం న్యాయస్థానం కోరింది.
లైంగిక వేధింపుల కేసులో హర్యానా మంత్రి సందీప్ సింగ్‌ను పోలీసులు ఆదివారం దాదాపు ఏడు గంటల పాటు విచారించారని మంత్రి తరపు న్యాయవాది డి.సబర్వాల్ సోమవారం తెలిపారు. ఆయన రెండు ఫోన్‌లోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో సస్పెండ్ అయిన బీజేపీ నేత నుపుర్ శర్మ ఢిల్లీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.