ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ ధరలు పెరగడంతో దేశ రాజధాని నగరం పరిధిలో ఆటో, ట్యాక్సీ ధరలను పెంచేందుకు కేజ్రీవాల్ సర్కార్ ఆమోదం తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం దట్టమైన పొగమంచు నేపథ్యంలో రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటన యూపీలోని రాయ్‌బరేలీ జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
కాబూల్‌లోని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 20 మందికి పైగా మరణించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు దాడిని ధృవీకరించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
అగ్రరాజ్యమైన అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ సిస్టమ్‌లో భారీ సాంకేతిక లోపం కారణంగా అమెరికా అంతటా అన్ని విమానాలు నిలిపివేయబడ్డాయని బుధవారం వార్తా నివేదికలు వెల్లడించాయి.
పాకిస్థాన్‌లో పెట్టుబడులను పెంచే దిశగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరో కీలక అడుగు వేశారు. విధ్వంసకర వరదల ప్రభావంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు సాయంతో పాటు పెట్టుబడులను పెంచాలని ఆయన ఆదేశించారు.
ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 13న జెండా ఊపి ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వారణాసిలోని గంగానది ఒడ్డున టెన్త్ సిటీని ప్రారంభిస్తారు.
ఇటీవల విమానాల్లో మూత్ర విసర్జన చేసిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. అయితే ఈ సారి విమానంలో కాదు.. విమానాశ్రయం బయట చోటుచేసుకుంది.