Fight Over Online Posts: ఆన్‌లైన్ పోస్టులు రెండు గ్రూపుల మధ్య చిచ్చుపెట్టాయి. ఢిల్లీలో రెండు గ్రూపుల మధ్య ఆన్‌లైన్ పోస్ట్‌ల విషయంలో జరిగిన గొడవలో ముగ్గురు అబ్బాయిలు కత్తిపోట్లకు గురయ్యారు. జహంగీర్‌పురిలోని కె-బ్లాక్ ప్రాంతంలో జరిగిన గొడవ గురించి మంగళవారం సాయంత్రం 6.45 గంటలకు తమకు పీసీఆర్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో హత్యాయత్నం కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Rainbow Children’s Hospital: పిల్లలు పక్కతడుపుతున్నారా..? అయితే ఈ చికిత్స అవసరం
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రెండు గ్రూపుల అబ్బాయిలు గొడవకు దిగడంతో ముగ్గురు కత్తిపోట్లతో ఆసుపత్రి పాలైనట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 307/34 కింద రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. మొత్తం ఎనిమిది మంది వ్యక్తులు పట్టుబడగా. అందులో ఎక్కువగా మైనర్‌లేని పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ముగ్గురు బాలురు రక్తస్రావమై పడి ఉండటాన్ని గుర్తించి వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు హత్యాయత్నం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి విచారణ పురోగతిలో ఉంది