కాళీ దేవత సిగరెట్ తాగుతున్నట్లు చూపుతున్న తన రాబోయే డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్‌పై వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన బహుళ ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని, రద్దు చేయాలని కోరుతూ చిత్రనిర్మాత లీనా మణిమేకలై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయ్యప్ప స్వాములు, భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అరుదైన ఘట్టం రానే వచ్చింది. భక్తులకు నక్షత్రంలా మెరుస్తూ మకరజ్యోతి దర్శన భాగ్యం కలిగింది. భక్తులకు శబరిమలలో మకరజ్యోతి కనువిందు చేసింది.
కొవిడ్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దాదాపు ఒక్క నెలలోనే కొవిడ్ సోకి 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చైనా ఆరోగ్య శాఖ అధికారులు నివేదించారు.
పాకిస్తానీ తాలిబన్‌కు చెందిన భారీ సాయుధ ఉగ్రవాదుల బృందం శనివారం పెషావర్ నగర శివారులోని ఒక పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడింది. ఈ దాడిలో సీనియర్ పోలీసు అధికారితో సహా ముగ్గురు పోలీసులను చంపినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసం, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది.
మలయాళ నటుడు విజయకుమార్‌ను పోలీసు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో విచారించగా.. ఆత్మహత్యాయత్నం చేసిన కేసులో కొచ్చి మేజిస్ట్రేట్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
ఒకప్పుడు దూకుడుగా ఉండే మట్టిపుత్రులు గల తమ పార్టీలో సమూలమైన మార్పు వచ్చిందని శివసేన(ఉద్ధవ్ బాల్‌థాక్రే) నాయకుడు ఆదిత్య థాక్రే అన్నారు. థానేలో తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం నిర్వహించిన జాబ్ మేళాలో మహారాష్ట్ర మాజీ మంత్రి మాట్లాడారు.
పోలీస్ కంట్రోల్ రూమ్‌కు పుణె రైల్వేస్టేషన్‌లో ఉగ్రదాడి జరగొచ్చని సమాచారం అందడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే చివరకు అది బూటకపు కాల్ అని తేలడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.