Extreme Cold: విపరీతమైన చలి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కొనసాగుతున్న చలి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్ కేసులు పెరుగుతున్నాయని, చలికాలంలో అధిక రక్తపోటు సాధారణమని సర్ గంగా రామ్ ఆసుపత్రి సీనియర్ న్యూరాలజిస్ట్ చెప్పారు. కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్‌కి దారితీయవచ్చన్నారు.
అధిక రక్తపోటు ఉన్న రోగులలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పర్వత ప్రాంతాల్లోని ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ స్థాయిలు క్షీణించడం వల్ల ప్రమాదానికి గురవుతారని డాక్టర్ సీఎస్ అగర్వాల్ వెల్లడించారు. గాలి తక్కువగా ఉండే పర్వతాల వద్దకు వెళితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. రోజుల తరబడి సూర్యుడు రానప్పుడు ఇంట్లోనే ఉండడం వల్ల కూడా ఒత్తిడి పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.అందువల్ల ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్న ప్రదేశాలలో అదనపు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని ఆయన అన్నారు.
అధిక రక్తపోటు ఉన్నవారికి బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని, తీవ్రమైన చలిలో రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, వైద్యులతో సకాలంలో సంప్రదింపులు జరపడం అవసరమని సీనియర్ న్యూరాలజిస్ట్ సీఎస్ అగర్వాల్ వెల్లడించారు. చల్లని వాతావరణంలో రక్తపోటు తరచుగా పెరుగుతుంది. దీనితో పాటు, శీతాకాలంలో చెమట లేకపోవడం వల్ల, శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది, రక్తపోటు స్థాయిలను పెంచుతుందని అన్నారాయన. అనేక మంది బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లు ఇటీవల కాన్పూర్‌లోని ఆసుపత్రులలో చేరారు. అందులో 14 ఏళ్ల చిన్నారి మరణించింది. విపరీతమైన చలి కారణంగా 14 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Land Dispute: భగ్గుమన్న భూవివాదం.. పరస్పర కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం
మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, నిశ్చల జీవనశైలి, ఆక్సిజన్ లేకపోవడం, అలాగే అధిక ధూమపానం కూడా బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్ చెప్పారు.రక్తపోటు మందులు వేసుకోవడానికి ప్రజలు భయపడుతున్నారని, వైద్యుల సలహా తీసుకోకుండా మందులు కూడా మానేస్తున్నారని అన్నారు. చలికాలంలో విటమిన్ డి మాత్రలు వేసుకోవడం మంచిదని, మార్నింగ్ వాక్‌లకు వెళ్లకూడదన్నారు.