UP: యూపీలో ఘోరం.. కాలువలో పడ్డ కారు.. నలుగురు యువకులు మృతి
- ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం
- కాలువలో పడ్డ కారు
- నలుగురు యువకులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు కాలువలో పడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మధురలో చోటుచేసుకుంది.
మధురలోని మాగోర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా దైవియా సమీపంలో వేగంగా వస్తున్న మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. నలుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ఇది కూడా చదవండి: Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసిన బాలీవుడ్ నటులు.. ఫొటోలు వైరల్
మృతులు రాహుల్ వర్మ, అమిత్, మోహిత్, గుర్తు తెలియని యువకుడిగా గుర్తించారు. రాహుల్ వర్మ (23) మహావన్ లోని బల్దేవ్ ఘర్ పరిసరాల్లో నివసిస్తూ దర్జీగా పనిచేస్తున్నాడు. అమిత్ (23) మహావన్ లోని ప్రేమ్ నగర్ కలాన్‌కు చెందిన విద్యార్థి. మోహిత్ (22) మహావన్ లోని బల్దేవ్ ఘర్ ప్రాంతానికి చెందిన న్యాయ విద్యార్థి. మరొకరి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..UP 85 CV 9856 నంబర్ గల కారు రాహుల్ వర్మ సోదరుడు అడ్వకేట్ సజ్జన్ సింగ్‌కు చెందింది. నలుగురు యువకులు బుధవారం సాయంత్రం 6:30-7:00 గంటల మధ్య మహావన్ నుంచి బయలుదేరి ఒక కార్యక్రమానికి వెళుతున్నారు. ఈ క్రమంలో కాలువలో పడింది. బిడ్డలు విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pixel 10a India Launch: భారత్‌లో గూగుల్ ‘పిక్సెల్ 10ఏ’ విడుదల.. 5100mAh బ్యాటరీ, 48MP కెమెరా!
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి