UPI Payments: డిజిటల్ ఇండియా కలను సాకారం చేసేందుకు కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెచ్చిన డిజిటల్ చెల్లింపుల పర్యావరణాన్ని మరింత ప్రోత్సహించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. రూపే డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూపే డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడంతోపాటు మూడు కొత్త కో-ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సమావేశం అనంతరం కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు.
చిన్న మొత్తంలో డిజిటల్ లావాదేవీలకు రూ.2,600 కోట్ల ప్రోత్సాహక మొత్తాన్ని మోడీ కేబినెట్ ఆమోదించింది. భీమ్-యూపీఐ నుంచి జరిపే లావాదేవీలపై ప్రోత్సాహకం అందుబాటులో ఉంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి ముందు గతంలో యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి నిర్ణయాలు ఉండబోవని కేంద్రం తాజా నిర్ణయం ద్వారా చెప్పకనే చెప్పింది. దీనితో పాటు మూడు బహుళస్థాయి సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దేశీయంగా రూపే డెబిట్ కార్డులతోపాటు, తక్కువ విలువ కలిగిన భీమ్-యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం రూ.2,600 కోట్లు కేటాయించింది. రూపే, యూపీఐ ద్వారా పాయింట్ ఆఫ్ సేల్, ఇ-కామర్స్ వేదికలపై చేసే లావాదేవీలను ప్రోత్సహిస్తే బ్యాంకులకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడనుంది. యూపీఐ లైట్, యూపీఐ123పేను సైతం ప్రోత్సహించాలన్ని ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం.
Passports: అత్యంత బలహీనమైన పాస్‌పోర్టు పాకిస్థాన్‌దే.. మరి భారత్ సంగతేంటి?
దేశంలో సేంద్రియ ఉత్పత్తులు, విత్తనాలు, ఎగుమతులను ప్రోత్సహించేందుకుగాను మూడు కో-ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. వీటితో పాటు దేశంలో అమలవుతున్న ప్రధాన మంత్రి ఉచిత ఫుడ్ స్కీమ్ పేరును మార్చాలని మోదీ కేబినెట్ నిర్ణయించింది. ఇకపై కార్యక్రమానికి పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని నామకరణం చేయాలని నిర్ణయించారు. గత కేబినెట్‌లో ఉచిత ఆహార పథకాన్ని ఏడాది పాటు పొడిగించిన సంగతి తెలిసిందే.