Drug Gang Busted : సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులో ఓ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. అక్రమంగా దొంగచాటున నార్కోటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ గ్రామ శివారులో కేఎస్ఎం జనరిక్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ కంపెనీ పక్కన గల షెడ్డులో నార్కోటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నారని తెలుసుకుని ఎస్సై రామానాయుడు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఆ షెడ్డులో సర్కారు నిషేధించిన డ్రగ్స్ ఆల్ఫాజోలం, డైజోఫామ్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో అక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్న తిరుపతికి చెందిన మదన్మోహన్ రెడ్డి, గుంటూరు జిల్లా నివాసి గురువారెడ్డి, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేటకు చెందిన మనోహర్ , మరొక వ్యక్తి నరేందర్ గౌడ్‌తో కలిసి ఆల్ఫాజోలం,డైజోఫామ్ తయారుచేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు.
Drone Hulchul in Tirumala Live: తిరుమలలో డ్రోన్ కలకలం .. ఎన్టీవీ చేతిలో వీడియో
కీలక ముఠా సభ్యులు మదన్ మోహన్ రెడ్డి, గురువా రెడ్డి, మనోహర్ ముగ్గురిని అరెస్ట్ చేయగా.. నరేందర్ గౌడ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆరు లక్షల విలువ చేసే నార్కోటిక్ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 40 డ్రమ్ములలో ఉన్న ముడి పదార్థం, ఒక కారు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పటాన్ చెరు పోలీసులు వెల్లడించారు. ఈ నిందితులపై గతంలో సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి మరొక కేసు నమోదు అయినట్టు విచారణలో తేలింది. చాకచక్యంగా వ్యవహరించి డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీస్ సిబ్బందిని పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి అభినందించారు.