Revanth Reddy: ఈ నెల 30న భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా కశ్మీర్‌లో రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగరవేస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్య నాయకులంతా ముగింపు సభకు బయలుదేరి వెళతారని వెల్లడించారు. అందుకే హాత్ సే హాత్ జోడో యాత్రను కొద్దిరోజులు వాయిదా వేసుకున్నామన్నారు. ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులపాటు ఏకధాటిగా హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు.
ఫిబ్రవరి 6న హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి సోనియాగాంధీ లేదా ప్రియాంకా గాంధీని ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని తీర్మానించామన్నారు. ఫిబ్రవరి 6లోగా కొత్త డీసీసీలు బాధ్యతలు తీసుకుంటారన్నారు. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర నేతలకు సూచించారు. బాధ్యతగా పనిచేయనివారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు.
NVSS Prabhakar: కేసీఆర్ కళ్లకి అద్దాలు పెట్టించి.. మోడీ అభివృద్ధిని చూపించాలి..
ఇదిలా ఉండగా.. ఎవరైనా బహిరంగంగా మాట్లాడొచ్చని.. కానీ పార్టీకి నష్టం కలిగించేలా ఉండకూడదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావు ఠాక్రే సూచించారు. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే చర్యలు తప్పవన్నారు. తాను ఎవరికీ అనుకూలం కాదని.. అలాంటి ఆలోచన ఉంటే పక్కన పెట్టాలన్నారు. అధిష్ఠానం చెప్పింది చేయడమే తన విధి అని ఆయన నేతలకు స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భారత్ జోడో యాత్ర మాదిరిగానే తెలంగాణలో రెండు నెలల పాటు చేపట్టనున్న హాథ్‌సే హాథ్ జోడో కార్యక్రమాన్ని గడపగడపకూ తీసుకువెళ్లాలని సూచించారు. అంతా ఐక్యంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, అధికారంలోకి రావడం ఖాయమని ఠాక్రే అన్నారు.
Boora Narsaiah: ఇది కంటి వెలుగా.. లేక.. ఎన్నికల ప్రచార వెలుగా..?
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేస్తోన్న జోడో యాత్ర త్వరలో ముగింపు చెప్పనున్నారు. దీంతో భారత్ జోడో యాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. గత సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 30న ముగియనుంది. దీంతో రాహుల్ జోడో యాత్ర ముగింపు సభకు 24 రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ మీదుగా సాగిన యాత్ర.. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ చేరుకుని ఇక్కడే కొనసాగుతోంది.