‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు..’ అంటూ సినీగేయ రచయిత ఏ ప్రేరణతో రాశారో తెలియదు తెలియదు కానీ, ప్రస్తుత సమాజంలో కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో 39 మంది వలసదారులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయన గతంలో కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు వెళ్లిన పాత ఫోటోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఢిల్లీ శివారు నజాఫ్‌గఢ్‌లోని మిత్రోన్ గ్రామ శివార్లలో ఉన్న తన ధాబాలో తన సహజీవన భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో నింపినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. మహారాష్ట్రలో కూడా మరో దారుణం జరిగింది.
త్రిపుర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్నాలీ గోస్వామిపై భారతీయ జనతా పార్టీ (బీజేపి) కార్యకర్తలు మంగళవారం ధామ్‌నగర్‌లో దాడి చేశారు. దాడి చేసిన వారిలో కొందరు బీజేపీ కౌన్సిలర్లు కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు.
2024లో జరిగే అమెరికా అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్లు భారతీయ-అమెరికన్, అమెరికా రాజకీయవేత్త నిక్కీ హేలీ ప్రకటించారు. దీంతో, వైట్‌హౌస్‌కు పోటీగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సవాలు చేసిన మొదటి రిపబ్లికన్‌గా ఆమె అవతరించారు.
ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్న అనుమానితులపై భారీ అణిచివేతలో భాగంగా ఈరోజు కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బీబీసీ కార్యాలయాల్లో రెండో రోజూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ రూపంలో, దస్త్రాల్లో ఉన్న ఆర్థిక వ్యవహారాల సమాచారం నకలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.