ఓ వ్యక్తి తన ఆహారాన్ని రూమ్‌మేట్ నేలపై విసిరికొట్టాడనే కోపంతో అతనిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. స్నేహితుడిని హత్య చేసిన అనంతరం పెరట్లోకి తీసుకెళ్లి సమాధి చేశాడు.
ఉక్రెయిన్‌పై దాడికి ఏడాది కావొస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధ వినియోగంపై పరిమితి విధిస్తూ అగ్రరాజ్యంతో చేసుకున్న ఒప్పందంలో రష్యా భాగస్వామ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
అన్నాచెల్లెలు మధ్య సెక్స్ గురించి పాకిస్థాన్‌లోని ఓ యూనివర్సిటీ విద్యార్థులను వారి అభిప్రాయాలను అడిగిన నేపథ్యంలో సోషల్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు, విద్యార్థి సంఘాలు ఇస్లామాబాద్‌కు చెందిన సీఓఎంఎస్‌ఏటీఎస్ విశ్వవిద్యాలయం ప్రశ్నాపత్రంలోని ఈ అసభ్యకరమైన కంటెంట్‌ను నిందించారు.
దివాళా తీసిన శ్రీలంక వచ్చే నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి సిద్ధంగా ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ రోజు ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో పార్లమెంటును వాయిదా వేయవలసి వచ్చింది.
గ్యాంగ్‌స్టర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. గ్యాంగ్‌స్టర్లు, టెర్రర్ గ్రూపులు, డ్రగ్స్ మాఫియా మధ్య సంబంధానికి సంబంధించిన కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఎనిమిది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోందని అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి దాదాపు ఏడాది పూర్తి కావస్తోంది. ఇప్పటికీ అసంపూర్ణంగా కొనసాగుతున్న ఈ యుద్ధంతో ఇరు దేశాలు సాధించింది ఏమీ లేదు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడిని మొదలు పెట్టింది.
ముస్లింలు ఆచరించే త్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇటీవలే చట్టం చేసింది. వివాదాస్పద త్రిపుల్ తలాక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గతంలో వివాదాస్పదమైంది.
Javed Akhtar: ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ పాకిస్తాన్‌ను ఆ దేశంలోనే విమర్శించారు. 26/11 ఉగ్రపేలుళ్ల ఘటన గురించి గుర్తు చేస్తూ.. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్‌లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. 26/11 ఉగ్రవాదులు దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. భారతీయుల హృదయాలలో చేదు గురించి పాకిస్తాన్‌లో చేసిన ముక్కుసూటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పురాణ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం లాహోర్‌లో జరిగిన ఉత్సవం కోసం జావేద్ […]
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. 1,105 సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
ఐర్లాండ్ ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పెంపుడు కోడి దాడికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఐర్లాండ్‌లో జాస్పర్ క్రాస్ అనే వ్యక్తి తన పెంపుడు కోడిపుంజు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు.