మాజీ ఈజిప్షియన్ ప్రత్యేక దళాల అధికారి, అల్ ఖైదాలో ఉన్నత స్థాయి సభ్యుడిగా ఉన్న సైఫ్ అల్-అదెల్ తలపై 10 మిలియన్ల డాలర్ల బహుమతిని యూఎస్ ప్రకటించింది. ఇప్పుడు కొత్త యూఎన్ నివేదిక ప్రకారం, ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా కొత్త చీఫ్‌గా సైఫ్ అల్-అదెల్ పోటీలేని నాయకుడిగా ఉన్నట్లు వెల్లడించింది.
బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సర్వే గురువారం వరుసగా మూడో రోజు కొనసాగుతోంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎంపిక చేసిన బీబీసీ సిబ్బంది నుంచి ఆర్థిక డేటాను సేకరించారు.
అమెరికా దక్షిణ రాష్ట్రమైన అలబామాలోని హైవే సమీపంలో మిలిటరీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూలిపోవడంతో బుధవారం ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు.
కేరళలోని తిరువనంతపురంలో 50 అడుగుల లోతున్న పోటా బావిలో ఓ వీధికుక్క వారం రోజుల పాటు ఇరుక్కుపోయింది. భద్రతా కారణాలను చూపుతూ, వీధి కుక్కను రక్షించలేమని అగ్నిమాపక దళం నిర్ణయించింది.
ఆర్థిక సంక్షోభం పాకిస్థాన్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాక్ ప్రజలపై మరో బాంబు పేలింది. ఆ దేశ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్‌పై ముసుగు ధరించిన వ్యక్తి రెండు ముడి బాంబులు విసిరాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో గురువారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రాణనష్టం లేదా గణనీయమైన నష్టం జరిగినట్లు నివేదికలు లేనప్పటికీ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది.
మహారాష్ట్రలోని లాతూర్ నగరంలోని తూర్పు భాగంలో మిస్టరీ ధ్వనులు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బుధవారం భూమి లోపల నుంచి శబ్దాలు వస్తుండడంతో స్థానికులు వణికిపోయారు.
ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన మచు పిచ్చును పెరూ ప్రభుత్వం పర్యాటకుల సందర్శనకు అనుమతి ఇచ్చింది. దక్షిణ అమెరికాలోని అతిపెద్ద పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన మచు పిచ్చు ఇంకాన్ సిటాడెల్ పౌరుల నిరసనల కారణంగా అనేక వారాల పాటు మూసివేయబడింది.