Atrocious News: ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు..’ అంటూ సినీగేయ రచయిత ఏ ప్రేరణతో రాశారో తెలియదు తెలియదు కానీ, ప్రస్తుత సమాజంలో కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మహిళల పట్ల కనీసం కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కామవాంఛను తీర్చుకోవడం కోసం దిగజారి నేరాలకు పాల్పడుతున్నారు. అనాధాశ్రమం అని పెట్టి అబలలపై నిర్వాహకులు అత్యాచారాలకు పాల్పడిన అత్యంత అమానుషమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అనాధాశ్రమంలోని మానసిక వికలాంగ, భర్త కోల్పోయిన మహిళలపై వరుసగా అత్యాచారాలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Death Penalty: క్షుద్ర విద్యలొస్తాయని అనుమానంతో కుటుంబం హత్య.. ఐదుగురికి మరణదండన
లొంగని మహిళలను సంకెళ్లతో కట్టేసి వారిపైకి కోతులను ఉసిగొల్పి కరిపించారు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. గుండల పులియూర్ గ్రామంలో ఉన్న అన్బు జ్యోతి అనాధాశ్రమంలోని మానసిక వికలాంగ మహిళలకు మత్తుమందిచ్చి రాడ్లతో దాడి చేసి నిర్వాహకులు అత్యాచారం చేశారు. ఆశ్రమంలో ఉన్న 142లో పురుషులు109 ఉంటే మహిళల 33 మంది.. వారిలో ప్రస్తుతం 16 మంది మిస్సింగ్ అయినట్లు గుర్తించిన రెవెన్యూ, పోలీసు అధికారులు గుర్తించారు. తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయడమేకాకుండా, ఇనుప సంకెళ్లతో కట్టేసి కోతులతో కరిపించారని ఒడిశాకు చెందిన మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. ఆశ్రమంలోని వారిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. అక్రమాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో నిందితులను కఠినంగా శిక్షించాలని మానవ హక్కుల సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.