దేశవ్యాప్తంగా శ్రద్ధావాకర్ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే తరహాలో మరో దారుణం జరిగింది. ఈ ఘోరం దేశ రాజధాని ఢిల్లీ శివారులోని హరిదాస్‌పూర్‌లో చోటుచేసుకుంది.
ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలిపేందుకు సాధారణంగా ప్రేమలేఖలు రాస్తుంటారు. అది సాధారణమైన విషయమే. కానీ ఓ వ్యక్తి మాత్రం తను ప్రేమించి పెళ్లాడిన భార్యకు భారీ ప్రేమలేఖను రాశాడండోయ్.
నచ్చిన వారిని పెళ్లిచేసుకోవాలని భావించినవారు కులం, మతం, ప్రాంతాన్ని పట్టించుకోరు. మరికొందరు తమ లింగ బేధాన్ని కూడా పట్టించుకోకుండా ఒకే లింగం వారినీ పెళ్లి చేసుకుంటూనే ఉంటారు.
విదేశీ ప్రయాణ ప్యాకేజీలు ఇప్పిస్తానంటూ పలు రాష్ట్రాల్లో వందలాది మంది వైద్యులను మోసం చేసి కోట్లాది రూపాయలను దోచుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు మంగళవారం తెలిపారు.
అర్జెంటీనా, ఈజిప్ట్‌లు భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్‌ను కొనుగోలు చేయడంలో ఆసక్తిని కనబరచడంలో అనేక ఇతర దేశాలలో చేరాయి.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.
మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం సాధారణ విషయమే, కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు లేదా నలుగురు పిల్లలకు జన్మనిస్తుంటారు. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం ఎర్రమంజిల్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సలహదారులు శ్రీనివాస్ మాధవ్, సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి పాల్గొన్నారు.
ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందం మంగళవారం దాడులు చేసింది. ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇంటికి వెళ్లాల్సిందిగా కోరినట్లు సమాచారం.
దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయుధ ట్రక్కును బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో 20 మంది మరణించగా.. మరో 60 మంది గాయపడినట్లు లింపోపో ప్రావిన్స్ రవాణా విభాగం మంగళవారం వెల్లడించింది