Crime News: కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా నీచానికి ఒడిగట్టాడు. కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి. ఏ కూతురైనా ఎవరైనా తనకు హాని తలపెడితే వచ్చి తండ్రికి చెప్పుకుంటుంది. కానీ తండ్రే నీచానికి ఒడిగడితే ఎవరికి చెప్పుకోవాలి. అలాంటి దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. తండ్రి చేసిన ఈ ఘాతుకానికి 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
Read Also: Bribe: లంచం తీసుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు.. ఇంట్లో రూ.6కోట్లు లభ్యం
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయి తాలూకాలోని తన ఇంట్లో 14 ఏళ్ల బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది, పోలీసులు సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిందని ఒక అధికారి తెలిపారు. క వాలివ్‌లోని తన కుటుంబ నివాసంలో మూడు రోజుల క్రితం మరణించిందని, గురువారం నోట్ దొరికిందని ఆయన చెప్పారు. ఆమె మరణించిన తర్వాత బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిందని కేసు నమోదు కాగా.. అమ్మాయి రాసిన సూసైడ్ నోట్‌లో, ఆమె తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. ఆమె తన తల్లితో తన సమస్యను చెప్పుకున్నప్పటికీ.. దానిపై తల్లి ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిసింది. ఇక ఆత్మహత్యే శరణ్యమని ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్‌లో, బాలిక తన తండ్రిని కఠినంగా శిక్షించాలని కోరింది. కేసుపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.