Shah Rukh Khan: ముంబైలోని సూపర్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లా మన్నత్‌లోకి గురువారం ఇద్దరు యువకులు చొరబడ్డారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయటి గోడను దూకి మన్నత్ ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత భద్రతా సిబ్బంది వారిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో 20, 22 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు, తాము గుజరాత్ నుంచి వచ్చామని, తమ అభిమాన హీరోను కలవాలనే వచ్చామని పేర్కొన్నారు. అంతకు మించి దురుద్దేశమేమీ లేదని పేర్కొన్నారు.
Read Also: Crime News: కన్నకూతురిపై తండ్రి లైంగిక వేధింపులు.. 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య
కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులపై ఏమైనా నేరచరిత్ర ఉందేమో అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. యువకులిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టిన ‘పఠాన్’ విజయంతో షారూఖ్ దూసుకుపోతున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్ల మార్కును దాటింది. జాన్ అబ్రహం, దీపికా పదుకొణె కూడా యాక్షన్-ప్యాక్డ్ చిత్రంలో నటించారు. షారుక్ ఖాన్ ఇప్పుడు తన రాబోయే చిత్రాలైన ‘జవాన్’ , ‘డుంకీ’ కోసం సిద్ధమవుతున్నాడు.