Abandoned Dogs: దక్షిణ కొరియాలో ఓ ఇంట్లో 1000 కుక్కలు చనిపోవడం కలకలం రేపింది. 60 ఏళ్ల ఓ వ్యక్తి 1000 కుక్కలను ఇంట్లోనే బంధించి ఆకలితో అలమటించేలా చేసిన అవి చనిపోయేంతవరకు అలాగే ఉంచాడు. తమ కుక్క తప్పిపోవడంతో దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన యజమాని ఒకరు ఓ ఇంట్లో శునకాలు చనిపోయి ఉండడం చూసి అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడిని గ్యాంగి ప్రావిన్స్‌లోని యంగ్‌ప్యోంగ్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేశారు. జంతు వేధింపుల కేసును దర్యాప్తు చేస్తున్న దక్షిణ కొరియా పోలీసులు.. నిందితుడు కుక్కలను తీసుకువెళ్లి చనిపోయే వరకు ఆకలితో ఉంచినట్లు అంగీకరించాడని కొరియా హెరాల్డ్ నివేదించింది.
అయితే శునకాల మృతికి తానే కారణమని నిందితుడు అంగీకరించాడు. యజమానులు వదిలేసిన, జీవితకాలం పూర్తయిన శునకాలను సేకరించి వాటి కడుపుమాడ్చి చనిపోయేలా చేసినట్లు వివరించాడు. ఇందుకు గాను ఒక్కో శునకానికి వాటి యజమానులు తనకు రూ.623 ఇచ్చినట్లు వెల్లడించాడు. జంతు హక్కులు ఉల్లంఘించినందుకు ఇతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అధికారులు. స్థానిక చట్టాల ప్రకారం ఇతనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది.
Read Also: Arun Subramanian: అరుణ్ సుబ్రమణియన్‌కు అరుదైన గౌరవం.. న్యూయార్క్‌కు తొలి దక్షిణాసియా న్యాయమూర్తి
ఆకలితో అలమటిస్తున్న కుక్కలను బోనుల్లో, బస్తాల్లో, రబ్బరు పెట్టెల్లో బంధించాడు.చనిపోయిన కుక్కలను ఈ వారంలో తొలగిస్తామని యాంగ్‌పియోంగ్‌లోని స్థానిక ప్రభుత్వం తెలిపింది. నాలుగు కుక్కలు మాత్రమే హింసాత్మక పరిస్థితులను తట్టుకోగలిగాయి. నాలుగు కుక్కల్లో రెండింటి పరిస్థితి విషమంగా ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. దక్షిణ కొరియాలో కఠినమైన జంతు సంరక్షణ చట్టాలు ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా ఆహారం లేదా నీరు ఇవ్వకుండా విఫలమవడం ద్వారా జంతువును చంపిన వారికి మూడేళ్ల జైలు శిక్ష లేదా 30 మిలియన్ల వరకు జరిమానా విధించబడుతుంది. దేశంలో జంతు దుర్వినియోగం కేసులు నమోదయ్యాయి. 2010-2019 మధ్య తొమ్మిదేళ్ల కాలంలో జంతు హింస కేసులు 69 నుండి 914కి పెరిగాయని మిర్రర్ నివేదించింది.