ఈ రోజుల్లో ఆస్తికోసం సొంతవాళ్లనే చంపుకుంటున్నారు. జీవితంలో తమకు బంధాల కన్నా ఆస్తులే ముఖ్యమని భావిస్తున్న ఈ రోజుల్లో ఆ అన్నలు మాత్రం అలా ఆలోచించలేదు. ఆస్తులు కాదు తమకు చెల్లెలె ముఖ్యమని పెళ్లిని ఘనంగా జరిపించారు. కట్నం కింద రూ.8కోట్లు సమర్పించుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
తునీషియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. సబ్-సహారా ఆఫ్రికా నుంచి 29 మంది వలసదారులు మధ్యధరా సముద్రం దాటి ఇటలీకి వెళ్లడానికి ప్రయత్నించగా.. వారి రెండు పడవలు ట్యునీషియా తీరంలో మునిగిపోవడంతో మరణించినట్లు ట్యునీషియా తీర రక్షక దళం ఆదివారం తెలిపింది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనర్హత వేటు తర్వాత ఖుష్బూ సుందర్ పాత ట్వీట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఖుష్బు.. తన పాత ట్వీట్‌ను తొలగించేదే లేదని తేల్చి చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాల్లో అమెరికా అణ్వాయుధాలను మోహరించినట్లే బెలారస్‌లో తాము అణ్వాస్త్రాలను ఉంచే యోచనలో ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు.
ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు 2,000 లకు పైగా మమ్మీ చేయబడిన గొర్రె తలలను ఫారో రామ్‌సెస్ II ఆలయంలో ప్రసాదంగా ఉంచినట్లు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసుల 45 మంది సభ్యుల బృందం ప్రయాగ్‌రాజ్ జైలుకు తరలించనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు.
ఓ వ్యక్తి అనుకోకుండా చేసిన హత్యకు అమెరికాలోని ఓ న్యాయస్థానం అరుదైన తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తితో జరిగిన వివాదంలో తన వద్ద ఉన్న హ్యాండ్‌గన్‌తో అవతలి వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. అనుకోకుండా గన్ నుంచి బుల్లెట్ విడుదల కాగా.. అవతలి వ్యక్తి తప్పించుకున్నాడు.
కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) హెలికాప్టర్ కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయిందని అధికారులు వెల్లడించారు.