Buffalo Seized: ఇదేందయ్యో.. నీటి పన్ను బకాయి ఉందని గేదెను తీసుకెళ్లారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buffalo Seized: నీటి పన్ను చెల్లించడంలో విఫలమైనందుకు డెయిరీ నిర్వాహకుడికి చెందిన గేదెను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసి) శుక్రవారం స్వాధీనం చేసుకుంది. మొండిగా వ్యవహరించే ఎగవేతదారుల నుంచి ఆస్తి, నీటి పన్ను బకాయిలను వసూలు చేయడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.రూ.1.39 లక్షల నీటిపన్ను చెల్లింపులో జాప్యం చేసినందుకు డెలియన్ వాలా ప్రాంతానికి చెందిన డెయిరీ నిర్వాహకుడు బాల్కిషన్ పాల్ పేరుతో కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ (పీహెచ్‌ఈ) విభాగం నోటీసు జారీ చేసింది.
బాకీ ఉన్న నీటి పన్నును చెల్లించాలని బాల్కిషన్‌ను పలుమార్లు కోరినప్పటికీ హెచ్చరించినా పట్టించుకోలేదు. తర్వాత గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ (పీహెచ్‌ఈ) విభాగం తుది నోటీసును జారీ చేసింది. కొన్ని రోజుల్లోగా చెల్లించాల్సిన నీటి పన్ను బకాయిలను చెల్లించాలని అతనికి అల్టిమేటం ఇచ్చింది. దీని తర్వాత కూడా బాల్కిషన్ నీటి పన్ను చెల్లించకపోవడంతో అధికారుల బృందం అతని వద్దకు చేరుకుని గేదెను జప్తు చేసింది.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
Read Also: Man Kills Wife: కాళ్లు చేతులు కట్టి గొంతుకోసి భార్య హత్య.. ఆపై రైలు కింద దూకి..
గ్వాలియర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ కిషోర్ కన్యల్ మాట్లాడుతూ.. యజమాని నోటీసులు అందుకున్నప్పటికీ సకాలంలో పన్ను చెల్లించడంలో విఫలమైతే, అటాచ్‌మెంట్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. అనంతరం అతని చర లేదా స్థిరాస్తికి తుది నోటీసు జారీ చేయబడుతుందని, జప్తు చేయబడిందని తెలిపారు. “ఒక డెయిరీ నిర్వాహకుడు సకాలంలో నీటి పన్ను చెల్లించడంలో విఫలమైనందున మేము అతని గేదెను స్వాధీనం చేసుకున్నాము. అతని పేరుపై మొత్తం ₹ 1.39 లక్షల నీటి పన్ను పెండింగ్‌లో ఉంది” అని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!