Sukesh Chandrashekar: ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కాన్‌మన్ సుకేష్ చంద్రశేఖర్ సహ ఖైదీలు, వారి కుటుంబాల సంక్షేమం కోసం రూ.5.11 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు అనుమతి కోరుతూ జైళ్ల డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. ఆఫర్ అంగీకరించబడితే, ఇది ఉత్తమ పుట్టినరోజు బహుమతి అవుతుందంటూ లేఖలో పేర్కొ్న్నాడు. “ప్రియమైన వ్యక్తులకు దూరంగా, మంచి ఉద్దేశ్యంతో అదే పరిస్థితిలో ఉన్న మానవుడిగా ఖైదీల సంక్షేమం కోసం రూ. 5.11 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్‌ను అంగీకరించాలని నేను వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను. సహకారం ఉంటే నేను చాలా సంతోషిస్తాను. ఇది నా పుట్టినరోజు కాబట్టి మార్చి 25వ తేదీన ఆమోదిస్తే, ఇది నాకు ఉత్తమ బహుమతి అవుతుంది, ”అని అతను లేఖలో రాశాడు.
ఇదిలా ఉంటే ఆయన పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ నటి, సుకేష్ ప్రేయసి జాక్వలిన్ ఫెర్నాండెజ్‌కు లవ్ లెటర్ రాశాడు. ఆమెపై తనకున్న ప్రేమను ప్రేమలేఖలో వ్యక్త పరిచాడు.‘‘నా బేజీ జాక్వెలిన్ అంటూ… నా బొమ్మా, నా పుట్టిన రోజున నేను నిన్ను మిస్సవుతున్నా, నా చుట్టు ఉన్న నీ ఎనర్జీని కోల్పోతున్నా, నాకు మాటలు రావడం లేదు, నాపై నీ ప్రేమ ఎప్పటికీ అంతం కాదు, నాకు ఫ్రూవ్స్ అవసరం లేదు బేబీ’’ అంటూ లేఖలో తన భావాన్ని వ్యక్త పరిచాడు. జాక్వెలిన్ ప్రేమను తన జీవితంతో అమూల్యమైన బహుమతిగా పేర్కొన్నాడు. ఏదైమైనా నీకు అండగా నేనున్నానని నీకు తెలుసు, నాకు నీ లవ్ పంచినందుకు థాంక్స్, నా బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పిన మద్దతుదారులకు, స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Sukesh Chandrashekhar: బేబీ గర్ల్ నీ కోసం ఎందాకైనా వెళ్తా.. జాక్వలిన్ ఫెర్నాండెజ్‌కు లవ్ లెటర్..
ఈ నెల ప్రారంభంలో కూడా అతడు జాక్వెలిన్ హోలీ శుభాకాంక్షలు చెబుతూ లవ్ నోట్ రాశాడు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుకేష్ అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో జాక్వెలిన్ ను కూడా ఈడీ ప్రశ్నించింది. తరువాత ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో యాక్టర్ నోరా ఫతేహిని కూడా విచారించింది. రూ.200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తీహార్ జైలులో ఉన్న సమయంలో రాన్‌బాక్సీ మాజీ యజమాని శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్‌ను మోసగించినట్లు అభియోగాలు మోపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ కేసులో వసూళ్లపై విచారణ జరుపుతోంది.