Earth Hour: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రారంభించిన ‘ఎర్త్ అవర్’ కార్యక్రమాన్ని ఈ రోజు రాత్రి 8.30 గంటలకు జరుపుకోనున్నారు. రాత్రి 8.30 గంటలకు ఇళ్లు, కార్యాలయాల్లో ఒక గంట పాటు విద్యుత్ వాడకాన్ని నిలిపివేయనున్నారు. ఈరోజు దాదాపు 190 దేశాల్లోని ప్రజలు ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.‘‘లైట్ ఆఫ్ మూవ్‌మెంట్’’గా పిలిచే ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేస్తోంది.
Read Also: Women’s World Boxing Championship: స్వర్ణం గెలిచిన నీతూ.. ఆరో మహిళగా రికార్డు
శనివారం రాత్రి 8.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు గంటపాటు అన్ని లైట్లు, విద్యుత్ ఉపకరణాలను ఆఫ్ చేయమని ఎర్త్ అవర్ ప్రజలను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వాలు, కంపెనీలు కూడా తమ భవనాలు, స్మారక చిహ్నాలు, ల్యాండ్ మార్క్‌లలో అనవసరమైన లైట్లను ఆఫ్ చేయడం ద్వారా మన గ్రహం మీద శక్తి ఆదా చేసేలా అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. సిడ్నీలో ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని మొదటిసారి నిర్వహించారు. ఆ రోజున స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు సిడ్నీలో జరిగింది. ఇక్కడ ప్రజలు ఒక గంట పాటు లైట్లు ఆర్పేశారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పాల్గొనడంతో మార్చి 29, 2008న జరుపుకున్నారు. నాటి నుంచి ఎర్త్ అవర్‌కు ప్రజాదరణ పెరుగుతూనే వుంది. ప్రతి యేటా మార్చి చివరి వారంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి దీనిని ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని ప్రముఖ చారిత్రక కట్టడాలన్నింటిలో విద్యుత్తును నిలిపివేయనున్నారు.