Accident: పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని హల్దియా-మెచెడా రాష్ట్ర రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బస్సును ఢీకొనడంతో 27 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సౌత్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎస్‌బీఎస్‌టీసీ) బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Mujra party: ముజ్రా పార్టీల పేరుతో గలీజ్ దందా.. అమ్మాయిలతో నగ్న నృత్యాలు..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన ప్రయాణికులను రక్షించారు. గాయపడిన ప్రయాణికులందరినీ టోమ్‌లుక్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ 12 మంది ప్రయాణికులకు చికిత్స చేసి వెంటనే డిశ్చార్జ్ చేశారు. అయితే మిగిలిన 15 మందికి గాయాలు తీవ్రంగా ఉండడంతో వారిని ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఈ ప్రమాదం క్రాసింగ్ సమీపంలో జరిగింది. అక్కడ రహదారి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. బస్సు దిఘా నుంచి కోల్‌కతాకు వెళ్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.