మయన్మార్ జుంటా గవర్నమెంట్( మిలిటరీ ప్రభుత్వం) పర్యవేక్షణలోని ఎన్నికల సంఘం మంగళవారం సంచలన ప్రకటన చేసింది. ప్రతిపక్ష నేత ఆంగ్ సాన్ సూకీకి భారీ షాక్ ఇచ్చింది. ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి సుమోటో నోటీసు తీసుకునే విచక్షణ అధికారాలను పరిమితం చేసే లక్ష్యంతో పాకిస్తాన్ న్యాయ మంత్రి అజం నజీర్ తరార్ మంగళవారం సుప్రీంకోర్టు (ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్) బిల్లు, 2023ని ప్రవేశపెట్టారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రకటించనుంది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.
వారికి ఒకే కుమార్తె.. కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆమే ప్రాణమనుకున్నారు. మంచి చదువులు చెప్పించి జీవితంలో స్థిరపడిన అనంతరం పెళ్లి చేయాలని కలలు కన్నారు. కానీ ఆ అమ్మాయి ఒక యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త తల్లిదండ్రులను చంపే స్థితికి చేర్చింది.
ప్రేమించిన వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద వార్త తెలియడంతో ప్రేమికురాలు తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రేమికుడు లేని లోకంలో తానూ ఉండలేనని ఆత్మహత్యకు పాల్పడింది.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న భారతదేశం బుధవారం దేశ రాజధానిలో జాతీయ భద్రతా సలహాదారులు (NSA), ఉన్నత అధికారుల సమావేశాన్ని నిర్వహించనుంది.
2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
దక్షిణ ఈక్వెడార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈక్వెడార్‌లోని అలౌసీలో గల ఒక పర్వత గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో మట్టి, శిథిలాల కింద చిక్కుకుని 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
నమీబియా నుంచి భారత్‌కు తరలించిన ఎనిమిది చిరుతల్లో ఒకటి జనవరి నుంచి కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ సోమవారం మరణించింది. సాషా రోజువారీ పర్యవేక్షణ తనిఖీలో అలసట, బలహీనంగా ఉన్నట్లు కనిపించేందు. వైద్య పరీక్షల్లో చిరుత డీహైడ్రేషన్‌కు గురైందని, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని తేలింది.
కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప తన కుమారుడు కేఏఎస్ అధికారి ప్రశాంత్ మదాల్ ద్వారా లంచం డిమాండ్ చేశారన్న అభియోగంపై లోకాయుక్త పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.