Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాల్లో అమెరికా అణ్వాయుధాలను మోహరించినట్లే బెలారస్‌లో తాము అణ్వాస్త్రాలను ఉంచే యోచనలో ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో పాశ్చాత్య దేశాలతో రష్యాకు ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బెలారస్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాలను దాచి పెట్టే యూనిట్ల నిర్మాణం జులై 1 నాటికి పూర్తవుతుందని పుతిన్ ప్రకటించారు. ఆయుధాలు సహా అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న ‘ఇస్కందర్’ అనే స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థను ఇప్పటికే బెలారస్‌కు పంపించామని వెల్లడించారు. ఐరోపాలోని పలు దేశాల్లో నాటో కూటమి ఇప్పటికే అణ్వాయుధాలను మోహరించింది. దానికి వ్యతిరేకంగానే పుతిన్ తాజాగా ఈ చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. కానీ అణు ఆయుధాలను నియంత్రించే అధికారం మాత్రం బెలారస్‌కు బదిలీ చేయబోమన్నారు. అణు నిరాయుధీకరణ నిబంధనలను కూడా ఉల్లంఘించబోమన్నారు. ఉక్రెయిన్‌పై దాడికి బెలారస్‌ను స్థావరంగా వాడుకోవడానికి లుకషెంకో రష్యాకు అనుమతి ఇచ్చారు. రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాలను బెలారస్‌లో ఉంచేందుకు అంగీకారం తెలిపామని దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తెలిపారు. ఈ మేరకు అణ్వస్త్రాలను మోసుకెళ్లే స్వల్ప శ్రేణి వ్యవస్థను దాదాపు 30 ఏళ్లుగా అలెగ్జాండర్ బెలారస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతేడాది తమ భూభాగంలో నుంచి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించేందుకు రష్యాకు అనుమతించిన సంగతి తెలిసిందే.
Read Also: Planes Collide: గగనతలంలో తృటిలో తప్పిన ప్రమాదం.. రెండు విమానాలు ఢీకొనబోయి..
మరోవైపు అణ్వాయుధాల నిర్ణయంపై ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశంలో అంతర్గతంగా అస్థిరీకరణకు దారి తీస్తుందని ఉక్రెయిన్ భద్రతా సలహాదారు ఒలెక్సీ డానిలోవ్ అన్నారు. పలు దేశాలు కూడా ఇతర దేశాల్లో తమ అణ్వాయుధాలను ఉంచాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఇది అసాధారణ విషయమేమీ కాదని చెప్పారు. మరోవైపు రష్యా చర్యలను నాటో విమర్శించింది. ఇది ప్రమాదకరమైన, బాధ్యతరహిత చర్యగా పేర్కొంది. తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని నాటో ప్రతినిధి తెలిపారు.