Boat Sinks Off: తునీషియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. సబ్-సహారా ఆఫ్రికా నుంచి 29 మంది వలసదారులు మధ్యధరా సముద్రం దాటి ఇటలీకి వెళ్లడానికి ప్రయత్నించగా.. వారి రెండు పడవలు ట్యునీషియా తీరంలో మునిగిపోవడంతో మరణించినట్లు ట్యునీషియా తీర రక్షక దళం ఆదివారం తెలిపింది. విడిగా గత నాలుగు రోజుల్లో, ఐదు వలస పడవలు దక్షిణ నగరం స్ఫాక్స్ తీరంలో మునిగిపోయాయి. ఇటలీ వైపు వెళ్లే పడవలు మునిగిపోవడం వల్ల 67 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 19 మృతదేహాలను స్వాధీనం చేసినట్లు నేషనల్ కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు.
Read Also: Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 11 మందిని రక్షించినట్లు వారు తెలిపారు. మునిగిపోయిన ఐదు పడవల్లో ఇంకా ఎంత మంది ఉన్నారనే విషయం వెంటనే తెలియరాలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. ఐరోపాలో మెరుగైన జీవితం కోసం ఆఫ్రికా నుంచి ప్రజలు వలస వెళ్తున్నట్లు తెలిసింది. గత నాలుగు రోజుల్లో ఇటలీకి వెళ్తున్న సుమారు 80 పడవలను నిలిపివేసి, 3,000 మందికి పైగా వలసదారులను అదుపులోకి తీసుకున్నామని, ఎక్కువగా సబ్-సహారా ఆఫ్రికా దేశాల నుండి వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నామని కోస్ట్ గార్డ్ తెలిపింది.