Man Sentenced: అనుకోకుండా చిన్నారి హత్య.. దోషికి 100 ఏళ్ల జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Sentenced: ఓ వ్యక్తి అనుకోకుండా చేసిన హత్యకు అమెరికాలోని ఓ న్యాయస్థానం అరుదైన తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తితో జరిగిన వివాదంలో తన వద్ద ఉన్న హ్యాండ్‌గన్‌తో అవతలి వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. అనుకోకుండా గన్ నుంచి బుల్లెట్ విడుదల కాగా.. అవతలి వ్యక్తి తప్పించుకున్నాడు. దీంతో సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి తలలోకి దూసుకుపోయింది. అభం శుభం తెలియని ఒక చిన్నారి బలైంది. దీంతో అమెరికా కోర్టు వందేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. భారత సంతతికి చెందిన బాలిక(5) మృతికి కారణమైనందుకు 35 ఏళ్ల వ్యక్తికి 100 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2021లో లూసియానా రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మాయా పటేల్ మరణానికి కారణమైనందుకు నిందితుడికి ఈ శిక్ష విధించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
మాంక్‌హౌస్ డ్రైవ్‌లోని ఓ హోటల్‌ను మృతురాలు మాయా పటేల్ తండ్రి స్నేహిల్ పటేల్, విమల్ అనే వ్యక్తి కలిసి నడిపిస్తున్నారు. మాయా కుటుంబం అదే హోటల్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండేది. హోటల్లో మాయా పటేల్ ఆడుతుండగా ఆమె తలలోకి ఓ బులెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో మాయా మూడు రోజులు పాటు ఆస్పత్రిలోనే మృత్యువుతో పోరాడి 2021 మార్చి 23న ప్రాణాలు విడిచింది. అసలేం జరిగిందంటే…ష్రేవ్‌పోర్ట్‌కు చెందిన జోసెఫ్ లీ స్మిత్ అనే వ్యక్తి ఆ హోటల్‌లోని పార్కింగ్ వద్ద ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన స్మిత్ ఆవ్యక్తి పైకి ఎంఎం హ్యాండ్‌గన్‌ని ఎక్కుపెట్టారు. దీంతో విడుదలై బుల్లెట్ నుంచి సదరు వ్యక్తికి తప్పించుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆ హోటల్ గదిలో ఆడుకుంటున్న భారత సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మాయాపటేల్ తలలోకి దూసుకుపోయింది. దీంతో మాయా పటేల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
Read Also: ALH Dhruv helicopter: ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్ .. టేకాఫ్ అవుతుండగా..
ఈ నేపథ్యంలో జోసెఫ్ లీ స్మిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోసెఫ్ లీ స్మిత్ అనే వ్యక్తిని జనవరిలోనే మాయా పటేల్ హత్య కేసులో జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. దీంతో జిల్లా కోర్టు జడ్జి జాన్ డీ మోస్లే.. స్మిత్‌కు 60 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అలాగే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు మరో 20 ఏళ్లు, ఇతర కారణాలతో మరో ఇరవై సంవత్సరాల శిక్షను విధించారు. నిందితుడు స్మిత్‌కు మొత్తం 100 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!