ALH Dhruv helicopter: ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్ .. టేకాఫ్ అవుతుండగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ALH Dhruv helicopter: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) హెలికాప్టర్ కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. అది ఒక ఏఎల్‌హెచ్ ధ్రువ్ మార్క్-3 శిక్షణ హెలికాప్టర్ అని తెలిపారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురు వ్యక్తులున్నారని.. అందులో ఓ వ్యక్తికి చేయి విరిగినట్లు చెప్పారు. కోస్ట్ గార్డ్ ట్రైనింగ్ సెషన్‌లో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
నెడుంబస్సేరి విమానాశ్రయం రన్ వే నుంచి టేకాఫ్ తీసుకునే ప్రయత్నంలో ఈ ఘటన మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే రన్ వేకు ఐదు మీటర్ల దూరంలో హెలికాప్టర్ కూలిపోవడంతో రన్ వేను తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను అక్కడి నుంచి తరలించిన వెంటనే రన్‌వే తెరుచుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.
Also Read
Read Also: Accident: ఆయిల్ ట్యాంకర్-బస్సు ఢీ.. 27 మంది ప్రయాణికులకు గాయాలు
‘‘ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ఏఎల్‌హెచ్ ధృవ్ మార్క్-3 హెలికాప్టర్‌ను పైలట్లు పరీక్షిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో హెలికాప్టర్ సుమారు 25 అడుగుల ఎత్తులో ఉంది. ఏఎల్‌హెచ్ ధృవ్ ఫ్లీట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఐసీజీ కృషి చేస్తోంది’’అని ఐసీజీ అధికారులు తెలిపారు.
కాగా.. ముంబై తీరంలో నేవీ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో మార్చి 8 నుంచి ఏఎల్ హెచ్ ధృవ్ హెలికాప్టర్లను నిలిపివేశారు. మార్చి 8న, భారత నావికాదళానికి చెందిన ALH బుధవారం ముంబై తీరంలో ప్రమాదానికి గురైంది. నేవల్ పెట్రోలింగ్ క్రాఫ్ట్ ద్వారా ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు నేవీ తెలిపింది. ఈ ఘటనపై విచారణకు కూడా ఆదేశించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు