ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను ప్రాథమికంగా మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొన్న ఎన్నికల సంఘం.. ఆయన వైపు నుంచి ఎటువంటి స్పందన లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
అకాల వర్షాల వల్ల ఇప్పటికే పంట నష్టంతో అల్లాడిపోతున్న అన్నదాతలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను రానుందని.. ఆగ్నేయ బంగాళఖాతంలో తుపాను బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ల్లీ లిక్కర్ స్కాం విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన దూకుడును పెంచింది. ఈ కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారిని విచారిస్తూ తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తోంది. కాగా ఈ కేసులో తాజాగా ఈడీ పొరపాటు చేయడం సంచలనంగా మారుతోంది. ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్‌లో ఒకరి పేరుకు బదులుగా మరొకరి పేరును మార్చడం వల్ల గందరగోళంగా మారింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. క్రెమ్లిన్ డ్రోన్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ రాత్రిపూట రెండు డ్రోన్‌లతో క్రెమ్లిన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిందని రష్యా అధికారులు బుధవారం ఆరోపించారు
మానవత్వం మంటకలిసిపోతున్న నేటి రోజుల్లో తారక్ మజుందార్ లాంటి వాళ్లు ఉన్నారంటే ఆశ్యర్యపోకమానదు. ఇంతకు ఆయన ఏం చేశారంటారా... చనిపోయిన తన పెంపుడు చిలుకకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి దానిపట్ల.. తన ప్రేమను చాటుకున్నాడు.
ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ హత్యకు ఉక్రెయిన్ యత్నించిందని రష్యా నేడు ఆరోపించింది. ఆరోపించిన దాడికి ఉపయోగించిన రెండు డ్రోన్‌లను కూల్చివేసినట్లు పేర్కొంది.
తూర్పు ఆఫ్రికా దేశమైన రువాండాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తర, పశ్చిమ రువాండాలో వరదల కారణంగా కనీసం 109 మంది మరణించారని స్థానిక అధికారుల గణాంకాలు తెలిపాయి
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) బుధవారం వాప్కోస్(WAPCOS) మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజిందర్ కుమార్ గుప్తా, అతని కుమారుడు గౌరవ్‌ను అరెస్టు చేసింది.