Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన దూకుడును పెంచింది. ఈ కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారిని విచారిస్తూ తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తోంది. కాగా ఈ కేసులో తాజాగా ఈడీ పొరపాటు చేయడం సంచలనంగా మారుతోంది. ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్‌లో ఒకరి పేరుకు బదులుగా మరొకరి పేరును మార్చడం వల్ల గందరగోళంగా మారింది. మామూలుగా ఈ స్కాంలో ప్రమేయం ఉందన్న కారణంగా ఢిల్లీ ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ పేరును కేసులో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ సింగ్ ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్కాంతో అసలు సంబంధం లేని తన పేరును ఛార్జిషీట్‌లో చేర్చి.. తన ప్రతిష్టను దెబ్బతీశారని ఈడీకి లీగల్ నోటీసులు పంపారు. సంజయ్ సింగ్ ఏప్రిల్ 22న ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ సింగ్‌లకు తన లాయర్ ద్వారా లీగల్ నోటీసు పంపారు, క్షమాపణలు చెప్పాలని లేదా సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాలని కోరారు.
దీంతో తప్పు తమవైపు నుంచే జరిగిందని ఈడీ అంగీకరించింది. సంజయ్ సింగ్‌కు క్షమాపణలు చెప్పింది. కానీ అది క్లరికల్ మిస్టేక్ వలన జరిగిందని ఆయనకు ఈ కేసుకు సంబంధం లేదని.. రాహుల్ సింగ్‌కు బదులుగా మా స్టాఫ్ సంజయ్ సింగ్ అని టైపు చేయడంతో ఈ సమస్య తలెత్తిందని ఈడీ అధికారిక లేఖను రాసింది. అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చరిత్రలో తొలిసారి ఈడీ క్షమాపణలు కోరుతూ తనకు లేఖ రాసిందని సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. దీనితో బాధ్యత కలిగిన స్థానంలో ఉండి ఇలాంటి పొరపాట్లు చేయడమేంటని ఈడీని అంతా విమర్శస్తున్నారు. పాలసీని రూపొందించినప్పుడు రాహుల్ సింగ్ ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్నారు. పార్టీని, నేతలను అప్రతిష్టపాలు చేసేందుకు సంజయ్ సింగ్ పేరును ఈడీ ఛార్జిషీట్‌లో ‘పీఎంఓ ఆదేశాల మేరకు’ ప్రస్తావించారని ఆప్ ఆరోపించింది.
Read Also: Ukraine: క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడితో ఎలాంటి సంబంధం లేదు.. ఉక్రెయిన్ ప్రకటన
ఈ విషయంపై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ఏ సంబంధం లేని ఆప్ నేత సంజయ్ సింగ్‌ను కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలోకి లాగాలని ఈడీ చూసిందని , కానీ లీగల్ నోటీసులు పంపడంతో క్షమాపణలు చెప్పిందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఫేక్ అని తెలిపేందుకు ఇదే పెద్ద నిదర్శనమన్నారు. తమ పార్టీకి ఆదరణ పెరగడం చూసి ప్రధాని మోడీ ఈడీతో ఈ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.