జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో జరిగిన ఒక వివాహానికి ఉచిత భోజనం కోసం దొంగచాటుగా వచ్చిన కొంతమంది ఆహ్వానం లేని అతిథులు, వేడి పూరీలను వేయలేదని తిరస్కరించిన తర్వాత భారీ గందరగోళం సృష్టించారు. ఆ పెళ్లిలో వేడివేడి పూరీల కోసం రచ్చరచ్చ చేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఆ గొడవ ముగిసింది.
మరో వారం రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇదే సమయంలో కోట్ల కొద్దీ డబ్బులు చేతులు మారుతున్నాయి.
సెర్బియాలోని ఓ స్కూల్‌లో విద్యార్థి జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది విద్యార్థులు కాగా.. మరొకరు స్కూల్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు మృతి చెందారు. అదే స్కూల్‌లో చదివే ఓ టీనేజీ బాలుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు.
సాధారణంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానాను విధిస్తూ ఉంటారు. బీహార్‌లో ఓ ద్విచక్ర వాహనదారుడు సీటు బెల్టు పెట్టుకోనందుకు విచిత్రమైన ట్రాఫిక్ చలాన్ అందుకున్నాడు.
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు బుధవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ సహోద్యోగులకు సౌకర్యాలు కల్పించడం, బ్యూరోక్రాటిక్ జోక్యానికి ముగింపు పలకడం వంటి అనేక డిమాండ్లపై 13,000 మంది వైద్యులు సమ్మె చేస్తున్నారు.
ఏప్రిల్ 29న రాత్రి ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్- టాల్‌స్టాయ్ మార్గ్ కూడలి వద్ద ఘోరం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్‌యూవీ ఢీకొట్టింది. కారు బైక్‌ను ఢీకొట్టడంతో ముకుల్ (20) బైక్‌పై నుంచి కింద దూకేశాడు. వీరిని ఢీకొన్న కారు పైకప్పుపై బైక్ నడుపుతున్న దీపాంశు వర్మ (30) పడిపోయాడు.
లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలో అగ్రశ్రేణి క్రీడాకారులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) చీఫ్ పీటీ ఉష ఇవాళ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలిశారు. మాజీ ఒలింపియన్ అయిన పీటీ ఉష అక్కడ గుమిగూడిన మీడియాతో మాట్లాడకుండా నిరసన స్థలం నుంచి వెళ్లిపోయారు.
రాష్ట్రీయ జనతాదళ్ (RJD) జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే యదువంశ్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులు భారతదేశానికి చెందినవారు కాదని, వాస్తవానికి రష్యా, ఇతర యూరోపియన్ దేశాలకు చెందినవారని ఆయన ఆరోపించారు.
తూర్పు చైనాలోని కెమికల్ ప్లాంట్‌లో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తప్పిపోయారని, మరొకరు గాయపడ్డారని స్థానిక ప్రభుత్వం సోమవారం తెలిపింది.