బ్రిటీష్ సామ్రాజ్యంలో 70 ఏళ్ల తర్వాత తొలి పట్టాభిషేకం జరిగింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో రాజ పట్టాభిషేకం ఇవాళ ఘనంగా జరిగింది. బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ జరిగింది.
రాజధాని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతలకు హైకోర్టు తీర్పు చెంప చెళ్లుమనిపించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
పాకిస్థాన్‌లోని లాహోర్‌లోని జోహార్ టౌన్‌లో శనివారం ఉదయం ఇద్దరు గుర్తుతెలియని ముష్కరులు వాంటెడ్ టెర్రరిస్ట్, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ (కేసీఎఫ్) అధిపతి పరమజిత్ సింగ్ పంజ్వార్ అలియాస్ మాలిక్ సర్దార్ సింగ్‌ను కాల్చి చంపారు.
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2023, మే 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ నితీష్ రాణా భార్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును ఇద్దరు యువకులు బైక్‌పై వెంటాడారు. కారుకు పదే పదే అడ్డుపడ్డారు. సాచిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈ ఘటన ఈ నెల 4వ తేదీన రాత్రి న్యూఢిల్లీలో చోటు చేసుకుంది.
కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులకు బ్రేక్ పడటం లేదు. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 81 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. బాలిక తన ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో శుక్రవారం సాయంత్రం గజోల్ ప్రాంతానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది.
కర్ణాటకలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 140 సీట్లకు పైగా గెలుస్తుందని కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ శనివారం విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.
31 ఏళ్ల గూగుల్ ఉద్యోగి న్యూయార్క్‌లోని చెల్సియాలో గల ప్రధాన కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గురువారం చెల్సియాలోని గూగుల్ 14వ అంతస్తు భవనంపై నుంచి ఉద్యోగి దూకి మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీవ్రమైన వ్యాఖ్యలతో మండిపడ్డారు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అంటూ సీరియస్ అయ్యారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కొంతకాలంగా బెయిల్‌పై బయట ఉన్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు.