కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం ఫ్యాక్టరీల (సవరణ) చట్టం 2023ని ఉపసంహరించుకున్నట్లు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సోమవారం తెలిపారు. సంస్కరణలను తీసుకురావడానికి మాత్రమే కాకుండా, ఒక సమస్యపై ఏకాభిప్రాయ అభిప్రాయాన్ని అంగీకరించడానికి కూడా ధైర్యం అవసరమని నొక్కిచెప్పిన ఆయన.. అనేక కార్మిక సంఘాలు వ్యక్తం చేసిన భయాందోళనలను అనుసరించి వివాదాస్పద చట్టాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పార్టీ అగ్రనేతలు కోరితే తాను తన పదవికి రాజీనామా చేస్తానని అన్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి.
మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ మెక్సికోలో బస్సు కొండపై నుండి పడిపోవడంతో కనీసం 18 మంది మరణించారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు.
దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్ల నిరసనల కారణంగా గత నాలుగు నెలలుగా క్రీడలో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. తనను ఉరితీసినా సిద్ధంగా ఉన్నానని.. అయితే జాతీయ ఛాంపియన్‌షిప్‌లు, క్యాంపులతో సహా రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగిపోకూడదని, ఇది క్యాడెట్, జూనియర్ రెజ్లర్‌లకు హానికరమని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పేర్కొన్నారు.
మే 5న విడుదలవుతున్న 'ది కేరళ స్టోరీ' చిత్రానికి వ్యతిరేకంగా కేరళలో నిరసనలు తీవ్రమవుతున్నాయి. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు ఈ చిత్రాన్ని "ప్రచార చిత్రం" అని తీవ్రంగా విమర్శించారు.సోమవారం 'ది కేరళ స్టోరీ' మద్దతుదారులకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) యువజన విభాగం అయిన ముస్లిం యూత్ లీగ్ ఒక సవాల్‌ను విసిరింది.
థాయ్‌లాండ్‌లో మరో రెండు వారాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కేవలం రెండు వారాల ముందు ప్రధాని అభ్యర్థిగా పోటీలో ఉన్న పెటోంగ్‌టార్న్ షినవత్రా మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రతిపక్ష ఫ్యూ థాయ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న 36 ఏళ్ల రాజకీయవేత్త ఆసుపత్రి నుండి ఫోటోతో సోషల్ మీడియాలో తన కొడుకు పుట్టినట్లు ప్రకటించారు.
బీజేపీ మాజీ నేత, గిరిజన నాయకుడు నంద్ కుమార్ సాయి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీని విడిచిపెట్టడం తనకు కఠినమైన నిర్ణయమని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని భూపేష్ బఘేల్ ప్రభుత్వ పనులు తనకు నచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా పాల్గొని ఆయనకు పార్టీలోకి స్వాగతం పలికారు.
అమెరికా గన్‌కల్చర్ గురించి అందరికి తెలిసిన విషయమే. అగ్రరాజ్యంలో ఎక్కడో ఓ చోట గన్ సౌండ్ వినబడుతూనే ఉంటుంది. ఆ గన్‌కల్చర్‌కు అడ్డుకట్టు వేయడానికి న్యూయార్క్ ఓ సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించింది. తుపాకులను వెనక్కి ఇచ్చిన వారికి గిఫ్ట్ కార్డులు అందిస్తామని ప్రకటించింది.
బీజేపీ అధినేత జేపీ నడ్డా సోమవారం బెంగళూరులోని పార్టీ ప్రధాని కార్యాలయంలో మే 10న కర్ణాటక ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టో ‘ప్రజాధ్వని’ని విడుదల చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పార్టీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప సమక్షంలో నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. చెన్నైకి సమీపంలో ఉన్న తిరువళ్లూరు జిల్లాలో ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి వేడి సాంబారు గిన్నెలో పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఓ 21 ఏళ్ల యువకుడు మరణించినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.