Minister Karumuri Nageswara Rao: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీవ్రమైన వ్యాఖ్యలతో మండిపడ్డారు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అంటూ సీరియస్ అయ్యారు. సీఎం జగన్ అదేశాలతో అధికారులను అప్రమత్తం చేసి నష్టపోయిన రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు తగుదునట్టు వచ్చాడని.. దళారులను రైతులుగా చూపిస్తూ మాట్లాడించాడని ఆరోపించారు. టీడీపీ నాయకులు సైతం సీఎం జగన్ నిర్ణయాలు మెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా ధాన్యం తీసుకుంటున్నామన్నారు. సివిల్ సప్లై వ్యవస్థను నాశనం చేసి రూ.4,999 కోట్లు పసుపు కుంకుమ కింద నాశనం చేసిన ఘనత చంద్రబాబుది అని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Read Also: YS Viveka Case: సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి
చంద్రబాబు పర్యటనపై దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కామెంట్స్ చేశారు. “రైతును మహారాజుగా చూడాలనుకునే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయం చేయడం టీడీపీకే సాధ్యం. కథ, స్క్రీన్ ప్లే ప్రకారం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది..వ్యవసాయం దండగ అన్న వ్యక్తి కేవలం రాజకీయం కోసమే రైతుల కోసం మాట్లాడుతున్నారు. ఐదేళ్లలో మీరు చేసిన ధాన్యం సేకరణ కంటే మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎక్కువ ధాన్యం సేకరణ చేసింది. ధాన్యం అమ్మిన 21రోజుల్లో డబ్బులు రైతుకు చెల్లించాలని గొప్ప నిర్ణయం తీసుకున్న ఘనత సీఎం జగన్‌కు దక్కుతుంది.” అని ఆయన అన్నారు.