YSRCP MP Nandigam Suresh on TDP: రాజధాని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతలకు హైకోర్టు తీర్పు చెంప చెళ్లుమనిపించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతిలో చంద్రబాబు తనవారికే ప్రయోజనం చేకూర్చారని ఆయన ఆరోపించారు. అమరావతిలో తన సామాజిక వర్గానికి విలువైన భూములు ఇచ్చారని ఎంపీ మండిపడ్డారు. అసైన్డ్ రైతులను చంద్రబాబు చిన్నచూపు చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకు అమరావతి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేశారన్నారు. చంద్రబాబు అనుకున్న అమరావతిలో ఎస్సీ, బీసీలు ఉండకూడదని అనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పేదలకు పట్టిన దరిద్రం చంద్రబాబు అంటూ ఆయన ధ్వజమెత్తారు. నిన్న కోర్టు తన తీర్పుతో చంద్రబాబు కళ్లు తెరిపించిందని.. ఇప్పటికైనా ఆయన తన వైఖరిని మార్చుకోవాలన్నారు. పేదల పక్షాన సీఎం జగన్ పోరాటం చేస్తున్నారని.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీకి అభ్యంతరం ఏంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కవర్గానికైనా న్యాయం చేశారా అంటూ ఎంపీ సురేష్ ప్రశ్నించారు.
Read Also: Star Cricketer Wife: స్టార్ క్రికెటర్ భార్యకు చేదు అనుభవం.. వెంటపడి వేధించిన యువకులు
“చంద్రబాబు కోరుకున్న బినామీ రాజధాని కావాలా??.. సీఎం జగన్ కోరుకునే ప్రజా రాజధాని కావాలా?. మేము వచ్చాక అమరావతి పేదలను వెళ్ల గొడ్తామని అచ్చం నాయుడు అంటున్నారు.పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని పెయిడ్ రైతులను సుప్రీంకోర్టుకు చంద్రబాబు పంపించారు. రానున్న రోజుల్లో ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెబుతారు.” అని ఎంపీ సురేష్ అన్నారు.