ఆఫ్రికా దేశమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోల వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్నిరోజులుగా కుంభవృష్టిగా కురుస్తున్న వానలతో దక్షిణ కివు ప్రావిన్స్‌లో నదులకు వరదలు పోటెత్తాయి. దీంతో బుషుషు, న్యాముకుబి వంటి గ్రామాలను నదులు ముంచెత్తాయి.
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన సమావేశంలో చైనా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం జరిగింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ను ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి తాలిబన్ చైనా, పాకిస్తాన్‌తో అంగీకరించింది. ఆంక్షలతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి బిలియన్ల డాలర్లు సమకూరే అవకాశం ఉంది.
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన మొదటి జియు-జిట్సు టోర్నమెంట్‌లో పాల్గొని బంగారు, రజత పతకాలను గెలుచుకున్నారు. ఫేస్‌బుక్‌లో టోర్నమెంట్ చిత్రాలను పంచుకుంటూ.. "నా మొదటి జియు జిట్సు టోర్నమెంట్‌లో పోటీ పడి గెరిల్లా జియు జిట్సు జట్టు కోసం కొన్ని పతకాలు సాధించాను. నాకు శిక్షణ ఇచ్చినందుకు డేవ్ కమరిల్లో, ఖై వు, జేమ్స్ టెర్రీకి ధన్యవాదాలు!" అంటూ మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ చేశారు.
ఆమె వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనికి అది రెండో పెళ్లి. ఇది ఆమె కుటుంబానికి నచ్చలేదు. కోపంతో ఊగిపోయిన మహిళ మేనమామ.. ఆమె ఇంటికి వెళ్లాడు. మహిళను బయటకు ఈడ్చుకొచ్చి కొడవలితో గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆ 20 ఏళ్ల మహిళను హతమార్చాడు మేనమామ.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు,పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి మొక్కలు నాటారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హింస చెలరేగడంతో, భద్రతా దళాలు త్వరలో రాష్ట్రంలోని ఇండో-మయన్మార్ సరిహద్దులో వైమానిక నిఘాను ప్రారంభించనున్నాయి. రక్షణ వర్గాల ప్రకారం, భౌతిక దాడులు జరగకుండా ప్రాంతాలను పర్యవేక్షించడానికి మానవరహిత వైమానిక వాహనాలు (UAVs) ఉపయోగించబడతాయి.
ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా 13 భాషల్లో, 499 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మాత్రం నీట్ పరీక్షలు వాయిదాపడ్డాయి. మణిపూర్‌లో పరీక్ష కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులందరికీ రేపు నీట్ పరీక్ష ఉండదని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.
విద్యార్థుల నైపుణ్యాలను తెలుసుకునేందుకు నిర్వహించే పరీక్షలు వారి పాలిట మృత్యువుగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన కంటే ర్యాంకులకే అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది.
ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రోడ్‌షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఓ వైపు మణిపూర్‌లో హింస చెలరేగి తగలబడుతుంటే.. జమ్మూకశ్మీర్‌లో సైనికులు చనిపోతుంటే ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, రోడ్ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.